ఈ మ‌ధ్య కాలంలో హీరోలు న‌ట‌న‌తో పాటు ప‌లు షోల‌లో యాంక‌ర్ లుగా కూడా రాణిస్తున్నారు. దీన్ని ముందుగా నాగ‌ర్జున‌, చిరంజీవి తో మొద‌లు అయి ఎన్టీఆర్, నాని తో పాటు చాలా మంది హీరోలు యాంక‌ర్ గా రాణించారు. ఇలా హీరో లు యాంక‌ర్ లు గా బుల్లి తెర పై క‌న‌ప‌డ‌టాన్ని ప్రేక్ష‌కులు కూడా ఆద‌రించారు. అయితే హీరో ల కు ధీటు గా, స‌మానం గా హీరోయిన్ లు కూడా యాంక‌ర్ అవ‌తారం ఎత్త‌డానికి సిద్ధ ప‌డుతున్నారు. ఇప్ప‌టికే మిల్క బ్యూటీ త‌మ‌న్నా ఒక మాస్ట‌ర్ చేఫ్ అనే షో ద్వారా యాంక‌ర్ అవ‌తారం ఎత్తి ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తుంది. ఇప్పుడు మ‌రో క్క బ్యూటీ కూడా యాంక‌ర్ అవ‌తారం ఎత్తి ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధం అవుతుంది. ఆ స్టార్ హీరోయిన్ ఎవ‌రో కాదు.. సినిమా రంగం లోకి వ‌చ్చిన తక్కువ కాలంలో నే ఎక్కువ గుర్తింపు తెచ్చు కుని ఇటు తెలుగు అటు త‌మిళ్ హింది భాషల్లో బిజీ గా ఉన్న హీరోయిన్ కీర్తి సురేష్.తాజా గా అందిన స‌మాచారం ప్ర‌కారం స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ ఒక షో ద్వారా యాంక‌ర్ గా బుల్లితెర కు ప‌రిచ‌యం కాబోతున్నార‌ట‌. అందుకు ప్ర‌ణాళిక లు కూడా సిద్ధం అవుతున్నాయి. అంతే కాకుండా ఈ షో ను పాన్ ఇండియా రెంజ్ అన‌గా మొత్తం నాలుగు భాష ల‌లో ప్ర‌సారం చేయ‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌. అయితే దీని గురించి పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. కాని ఈ షో ద్వారా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్  వంటి ఇండ‌స్ట్రీలో ఉన్న గొప్ప గొప్ప న‌టుల‌ను ఇంట‌ర్వ్యూ చేయాల్సి ఉంటుందట‌. ఈ షో వారానికి రెండు లేదా మూడు రోజుల పాటు టెలికాస్ట్ చేస్తార‌ని తెలుస్తుంది. అలాగే మొత్తం  మూడు లేదా నాలుగు నెల‌లో మొద‌టి సిజిన్ ను పూర్తి చేయాల‌ని భావిస్తున్నార‌ట‌. అంతే కాకుండా ఈ షోను మొత్తం నాలుగు భాష‌ల‌లో టెలీకాస్ట్ చేయాల‌ని ఈ షో యాజ‌మాన్యం భావిస్తుంద‌ని స‌మాచారం. అయితే ఈ షో ఓకే అయితే కీర్తి సురేష్ ఇమేజ్ ఇంకా పెరిగే అవ‌కాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: