హోండా టూ వీలర్ కంపెనీ తన 100 సీసీ సెగ్మెంట్‌ లోకి Shine 100తో తిరిగి వచ్చేసింది. రాజస్థాన్‌ తప్ప మిగిలిన రాష్ట్రాల్లో ఈ బైక్‌ ధర రూ.64,900 ఉంది.ఇక రాజస్థాన్‌లో మాత్రం 62,900 కి హోండా కంపెనీ  అందిస్తోంది. ఈ సెగ్మెంట్‌లో షైన్‌ 100.. బజాజ్‌ ప్లాటినా 100, హీరో స్ప్లెండర్‌+ ఇంకా హీరో హెచ్‌ఎఫ్‌ డీలక్స్‌లకు పోటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.హోండా షైన్‌ వినియోగదారులకు చాలా ఆఫర్లని ఇచ్చింది. 100 పే 100 ప్రత్యేక ఫైనాన్స్‌ స్కీమ్‌ ఆఫర్లని ప్రకటించింది. ఇక వీటిలో తమకు కావాల్సిన ఆప్షన్లను ఎంచుకోవచ్చు. ఇంకా అలాగే ఇందుకు 0 రూపాయల డాక్యుమెంట్‌ ఛార్జీలు వసూలు చేస్తామని ఇంకా మందస్తుగా ఎలాంటి ఈఎంఐ వసూలు చేయబోమని అలాగే ప్రొసెసింగ్‌ ఫీజు కింద రూ.1 చెల్లిస్తే సరిపోతుందని కంపెనీ తెలిపింది.ఇంకా వీటితో పాటు వినియోగదారులు 10 సంవత్సరాల వారంటీని పొందవచ్చని కంపెనీ వెల్లడించింది. అందులో 3 ఏళ్లు స్టాండర్డ్‌ వారంటీ ఇంకా మరో 7 సంవత్సరాలు ఆప్షనల్‌ వారంటీగా వస్తుందని కంపెనీ తెలిపింది.. అయితే ఈ ధరలు ఇంకా ఆఫర్లు ప్రస్తుతం రాజస్థాన్‌, బిహార్‌, లక్నోకు మాత్రమే వర్తిస్తాయి.


హోండా షైన్‌ మొత్తం 5 రంగుల్లో అందుబాటులో ఉంది. బ్లాక్‌ విత్‌ రెడ్‌ స్ట్రెప్స్, బ్లాక్‌ విత్ బ్లూ స్ట్రెప్స్, బ్లాక్‌ విత్ గ్రీన్‌ స్ట్రెప్స్, బ్లాక్ విత్‌ గోల్డ్‌ స్ట్రెప్స్ ఇంకా అలాగే బ్లాక్‌ విత్‌ గ్రే స్ట్రెప్స్ కలర్‌లో అందుబాటులో ఉంది. అలాగే అల్యూమినియం గ్రాబ్‌ రైయిల్‌, హాలోజన్‌ హెడ్‌ల్యాంప్, బోల్డ్‌ టెయిల్ ల్యాంప్ ఇంకా అల్లాయ్‌ వీల్స్ ఈ బైక్‌ సొంతం.అలాగే ఈ హోండా షైన్‌ 100 బైక్‌.. 98.98 ఎయిర్ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ బైక్‌ 7500 rpm వద్ద 7.2 bhp ఇంకా 5000 rpm వద్ద 8.05 గరిష్ట టార్క్‌ను జనరెట్ చేస్తుంది. ఇక గేర్ బాక్స్ 4 యూనిట్లను కలిగి ఉంటుంది.అలాగే షైన్ 100 బైక్‌ ఇంజిన్‌ సామర్థ్యం తక్కువ ఉన్నప్పటికీ.. అప్డేటెడ్ ప్యూయల్‌ ఇంజెక్షన్‌ సిస్టమ్‌ను కలిగి ఉంది.ఇటువంటి వాహనాల్లో ఇంధన సామర్థ్యం చాలా ముఖ్యం.చాలా మంది వినియోగదారులు ఇంధన సామర్థ్యాన్ని కీలకంగా భావిస్తారు. ఈ బైక్‌ ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లోనైనా చాలా స్మూత్‌గా స్టార్‌ అవుతుంది. అలాగే ఈ బైక్‌లో మరొక కీలక ఫీచర్‌ ఉంది.సైడ్‌ స్టాండ్‌ ఉంటే దీని ఇంజిన్‌ స్టార్ట్‌ అవ్వదు.

మరింత సమాచారం తెలుసుకోండి: