ప్రస్తుత సమాజంలో అమ్మాయిలైనా.. అబ్బాయిలైనా అందమై జట్టు కోసం తెగ ఆరాట పడుతుంటారు. ఈ మధ్య మన దేశంలో బట్టతల బాధితులు బాగా పెరిగిపోతున్నారు. బట్టతలకు సంబంధించి అనేక సిద్ధాంతాలు వున్నవి. కొంతమంది బట్టతలను రాబోయే ముసలితనానికి గుర్తుగా భావిస్తారు. కొంతమంది బట్టతల గల వ్యక్తులు తెలివిగల వాళ్ళుగా భావిస్తారు. బట్టతల ధనవంతులకు చిహ్నంగా భావించేవారు లేకపోలేదు. ఏదేమైనప్పటికి జుట్టు రాలిపోవుట వలన మనిషి తన సహజమైన అందాన్ని కోల్పోతాడు. ఆడ‌వారికైతే జుట్టు రాల‌డం, మ‌ళ్లీ పెర‌గ‌డం మామూలే.

 

కానీ.. మ‌గ‌వారికి మాత్రం అలా వెంట్రుక‌లు రాల‌డం మొద‌లైతే చివ‌ర‌కు అది బ‌ట్ట‌త‌ల‌కు దారి తీస్తుంది. ప‌ని ఒత్తిడి, కాలుష్యం, కెమిక‌ల్స్ ఉప‌యోగించి త‌యారు చేసిన షాంపూలు, దీర్ఘ‌కాలిక వ్యాధులు… ఇలా కార‌ణాలు ఏమున్నా మ‌గ‌వారిలో ఇప్పుడు బ‌ట్ట‌త‌ల చాలా త‌క్కువ వ‌య‌స్సులోనే వ‌స్తోంది. సో.. అలాంటి వారు చిన్న చిన్న ట్రిక్స్ ఫాలో అయితే బ‌ట్ట‌త‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. కొద్దిగా కొత్తిమీర‌ను తీసుకుని దాన్ని బాగా న‌లిపి పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్ నుంచి ర‌సం తీయాలి. ఆ రసాన్ని నిత్యం త‌ల‌కు ప‌ట్టిస్తుంటే కొద్ది రోజుల‌కు వెంట్రుక‌ల పెరుగుద‌ల మొద‌ల‌వుతుంది.  ఆముదం చాలా మందంగా ఉంటుంది. 

 

దీన్ని జుట్టు, మాడుకి పట్టించడం వల్ల హెయిర్‌ గ్రోత్‌ పై దుష్ప్రభావం చూపే వాటి నుంచి ప్రొటెక్ట్‌ చేస్తుంది. ఆముదం జుట్టుని స్ట్రాంగ్‌గా చేసి.. చివర్లు చిట్లిపోవడాన్ని నివారిస్తుంది. మ‌రియు కొబ్బ‌రిపాల‌ను తీసుకుని నేరుగా జుట్టుకు రాయాలి. ఇది జుట్టు పెరుగుద‌ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. అలాగే మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టి మెత్త‌ని పేస్ట్‌లా చేయాలి. దీన్ని త‌ల‌కు అప్లై చేసి కొంత సేప‌టి త‌రువాత స్నానం చేసేయాలి. ఊడిపోయిన వెంట్రుక‌ల‌ను తిరిగి మొలిపించేందుకు ఇది బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది. అదే విధంగా, క‌రివేపాకును పేస్ట్ చేసి త‌ల‌కు ప‌ట్టిస్తే జ‌ట్టు స‌మ‌స్య‌లు పోయి ఒత్తుగా పెర‌గ‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: