మృదువైన, అందమైన పెదవులను కలిగి ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. చిరునవ్వు.. మనిషి అందాన్ని మరింత పెంచుతుంది. మరి ఆ చిరునవ్వు అందంగా ఉండాలంటే.. పెదాలు కూడా అంతే అందంగా ఉండాలి క‌దా. అయితే బిజీ లైఫ్ స్టయిల్, పర్యావరణ కాలుష్యం, కఠినమైన వాతావరణ పరిస్థితులు మరియు కాస్మెటిక్స్ ను ఎక్కువగా వాడటం వంటివి పెదాలపై దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. దీంతో పెదాల కాస్త న‌ల్ల‌గా మారుతుంటాయి. నల్లటి, డల్ మరియు పొడిబారిన లిప్స్ వంటి సమస్యల‌కు చెక్ పెట్టాలంటే ఈ సింపుల్ టిప్స్ వాడితే స‌రిపోతుంది. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి..!

 

రోజ్ వాటర్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి, పెదాలకు అప్లై చేయాలి. ఇలా రోజుకు మూడు, నాలుగు సార్లు చేస్తే పెదాలు మంచి క‌ల‌ర్‌ను పొందుతాయి. ఆల్మండ్ ఆయిల్ తో మిక్స్ చేసిన నిమ్మరసం అనేది పెదాలను నరిష్ చేసి హైడ్రేట్ చేస్తుంది. ఆల్మండ్ ఆయిల్ మరియు లెమన్ జ్యూస్ లను ఈక్వల్ క్వాన్టిటీలలో తీసుకోండి. ఈ మిశ్రమాన్ని పెదాలపై అప్లై చేసి రెండు నుంచి మూడు నిముషాలవరకు మసాజ్ చేసి గోరువెచ్చ‌ని నీటితో వాష్ చేసుకుంటే స‌రిపోతుంది.

 

ఆలివ్ ఆయిల్ డార్క్ లిప్స్ ను ప్రకాశంతంగా మార్చడానికి చాలా ఉపయోగపడుతుంది . ఆలివ్ ఆయిల్లో నేచురల్ లిప్స్ కు అవసరం అయ్యే అనేక పోషకాలున్నాయి. అందుకు ఆలివ్ ఆయిల్ ను కొన్ని చుక్కలు పెదాల మీద వేసి మాసాజ్ చేయాలి. నిద్రించే ముందు ప్రతి రోజూ రెగ్యులర్ గా చేస్తే మంచి ఫ‌లితం ల‌భిస్తుంది. పంచదారను మెత్తగా పౌడర్ చేసి అందులో రెండు చెంచాల బట్టర్ వేసి మెత్తగా పేస్ట్ చేసి, ఈ మిశ్రమాన్ని పెదాల మీద రుద్దాలి. ఇది పెదాల న‌లుపును ఈజీగా తొల‌గిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: