జుట్టు.. ప్రతిమహిళా కోరుకునేది ఇది. జుట్టు ఎంత అందంగా ఉంటె.. మహిళా అంతకు రెట్టింపు అందంగా ఉంటుంది. అయితే అలాంటి ఈ జుట్టు అందంగా.. పట్టులా మెరిసిపోవాలంటే ఏం చెయ్యాలో మీకు తెలుసా? స్ట్రైట్ హెయిర్, కర్లీ హెయిర్ ఉన్నవాళ్లు ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా? ఆ జాగ్రత్తలు ఏంటో ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

రాత్రిపూట జుట్టుకు మాయిశ్చరైజింగ్‌ క్రీమ్‌ రాసుకోవాలి.. జుట్టుకు మంచిగా ఎక్కువసేపు మసాజ్‌ చేయాలి. ఇలా చెయ్యడం ద్వారా జుట్టుకు మంచి పోషణ అందుతుంది. 

 

మీడియం సైజ్‌ దువ్వెనతో కుదుళ్ల నుండి జుట్టు చివరి వరకు బాగా దువ్వుకోవాలి. జుట్టు చిక్కులు పడకుండా రాత్రి దువ్వి పెట్టుకుంటే చాలు రాత్రంతా జుట్టుకు మంచి పోషణ లభిస్తుంది.

 

రాత్రి పడుకునే ముందు పోనీ టెయిల్ వేసుకుంటే మంచిది. జుట్టు అద్భుతంగా మారుతుంది. 

 

ఇంకా కర్లీ హెయిర్‌ ఉన్నవారు జుట్టుకు మరింత ఎక్కువ శ్రద్ద తీసుకోవాలి. రాత్రి నిద్రపోయే ముందు జుట్టుపై కొంచం నీళ్లు చల్లుకుని పడుకుంటే సరిపోతుంది. జుట్టు అందంగా మారిపోతుంది. 

 

హెయిర్ మిల్క్ అప్పుడప్పుడు రాసుకుంటే జుట్టు అందంగా మారుతుంది.. అలాగే జుట్టు రాలడం ముక్కలవ్వడం కూడా మారుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును అందంగా మార్చుకోండి.. ఆరోగ్యంగా మార్చుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: