జుట్టు పెంచాలని ఎవరికి ఉండదు చెప్పండి.. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల జుట్టు పెరగదు.. బయట కాలుష్యం, దుమ్ము, దూళి అన్ని మన తలలపైనే ఉంటాయి. వీటి నుండి తప్పించుకోడానికి మాస్కులు వాడిన పెద్దగా ప్రయోజనం ఉండదు.. జట్టు ఉడుతూనే ఉంటుంది.. అస్సలు పెరగదు.. 

 

అలాంటి సమయంలో కొన్ని చిట్కాలు తప్పక పాటించాలి.. ఆ చిట్కాలు ఏంటి అంటే? నిమ్మకాయతో కొన్ని జుట్టు రాలడం ఆగి పెరుగుతుంది. అయితే ఈ నిమ్మకాయను ఎలా ఉపయోగించాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

నిమ్మకాయను డైరెక్ట్ గా తాలకు పట్టించకూడదు.. ఆలా పట్టిస్తే తలా మొత్తం దురద పెడుతుంది. అందుకే నిమ్మకాయను షాంపూలో కలిపి పట్టించుకుంటే ఎటువంటి సమస్య ఉండదు. 

 

ఇంకా షాంపూలో కాకుండా నూనెలో కూడా మీరు కొబ్బరి నూనెలో నిమ్మకాయను కలుపుకొని పట్టించుకుంటే జుట్టు వత్తుగా పెరుగుతుంది. 

 

నిమ్మరసంలో తేనె, బాదం నూనెలో వేసి కలిపి దాన్ని తలకు పట్టించుకుంటే జుట్టు బాగా పెరుగుతుంది. 

 

పెరుగు, నిమ్మరసం కాళీ పట్టించుకుంటే చుండ్రు తగ్గి జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది. 

 

వేపాకులో నిమ్మరసం కలిపి పేస్ట్ చేసి తలకు పట్టించడం వల్ల చుండ్రు పోయి జుట్టుకు బలాన్ని ఇస్తుంది. 

 

గుడ్డులో తెల్ల సోనా కలిపి జుట్టుకు పట్టిస్తే ఆరోగ్యవంతంగా తయారవుతుంది. 

 

చూశారుగా.. ఈ చిట్కాలు పాటించి మీ జుట్టును ఆరోగ్యవంతంగా తయారు చేసుకోండి. 

మరింత సమాచారం తెలుసుకోండి: