సాధార‌ణంగా చాలా మంది అమ్మాయిలను వేధించే సమస్యల్లో అండర్ ఆర్మ్స్ ఒకటి. శరీరమంతా ఒక క‌ల‌ర్‌లో ఉంటే.. అండర్ ఆర్మ్స్ మాత్రం నల్లగా, మచ్చలు పడినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల‌ మనం స్లీవ్ లెస్ దుస్తులు ధరించడానికి తగిన ఆత్మవిశ్వాసం కోల్పోతాము. చర్మం కొన్ని పరిస్థితులలో అతిగా స్పందించడం మూలంగా అండర్ ఆర్మ్స్ నల్లగా, డ్రైగా మారతాయి. షేవింగ్, అధిక స్వేదం, అండర్ ఆర్మ్స్ కు గాలి త‌గ‌ల‌కుండా ఉండటం, డియోడరంట్ల వాడకం, మృతకణాలు పేరుకుపోవడం మొదలైనవి దీనికి కార‌ణం. 

 

అయితే స‌మ‌స్య‌ను త‌గ్గించుకు అండర్ ఆర్మ్స్ మృదువుగా అందంగా మారాలంటే కొన్ని సింపుల్ టిప్స్ ఉప‌యోగిస్తే స‌రిపోతుంది. అండర్ ఆర్మ్స్ వద్ద చర్మాన్ని తెల్లగా, మృదువుగా మార్చుకోవడానికి మన ఇంట్లో లభించే బేకింగ్ సోడా మంచి పరిష్కారం. కొంచెం నీరు తీసుకుని వంట సోడాను బాగా కలపి ముద్దగా చేయండి. ఈ ముద్దను అండర్ ఆర్మ్స్‌లో గట్టిగా రుద్దండి. కొన్ని నిమిషాల పాటు ఆరనిచ్చి గోరువెచ్చని నీళ్లతో కడిగేయండి. ఇలా క్రమంగా చేస్తూ ఉంటే మంచి ఫలితముంటుంది.

 

అలాగే తాజా పెరుగుని అండర్ ఆర్మ్స్ వద్ద అప్లై చేయాలి. ఒక గంట తరువాత గోరువెచ్చటి నీటితో చర్మాన్ని శుభ్రపరచాలి. వారానికి రెండు సార్లు ఇలా చేయ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. అలాగే అండ‌ర్ ఆర్మ్స్ వ‌ద్ద  తెనెను అప్లై చేయాలి. దాదాపు పావు గంత‌ తరువాత గోరువెచ్చటి నీటితో అండర్ ఆర్మ్స్ ని శుభ్రపరచాలి. వారానికి రెండుసార్లు ఈ రెమెడీని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు పొందొచ్చు.  


  
 
  

మరింత సమాచారం తెలుసుకోండి: