ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ ఆర్టికల్ చదవండి. అందంగా కనపడాలంటే కేవలం ముఖం మాత్రమే అందంగా ఉంటే సరిపోదు. అందమైన కళ్ళు ఉండాలి. కళ్ళు అందంగా ఉండాలంటే మన ఐ బ్రోస్ బాగుండాలి. ఐ బ్రోస్ ఎంత బాగుంటే కళ్ళు అంత అందంగా ఉంటాయి . కళ్ళు ఎంత అందంగా ముఖం అంత సౌందర్యవంతంగా ఉంటుంది. కళ్ళను మరింత అందంగా హైలైట్ చేయడానికి ఐ బ్రోస్ ఎంతో సహాయం చేస్తాయి. కాబట్టి, ఐ బ్రోస్ గురించి కేర్ తీసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి ఇండియా హెరాల్డ్ అందిస్తున్న ఈ సహజ సిద్ధమైన పద్ధతులు పాటించండి. ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది...

ప్రతి రోజూ కొబ్బరినూనెను ఐబ్రోస్ పై అప్లై చేస్తే మంచి రిజల్ట్ స్ వస్తాయి. వారంలో ఒకటి రెండు సార్లు వాడినా రిజల్ట్స్ బ్రహ్మాండంగా ఉంటాయి.కొబ్బరినూనె కండిషనర్ గా అలాగే మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇది రక్త ప్రసరణను  మెరుగు పరుస్తుంది. కొన్ని చుక్కల క్యాస్టర్ ఆయిల్ ను తీసుకుని ఐబ్రోస్ పై ఫింగర్ టిప్స్ తో మసాజ్ చేయాలి. ముప్పై నిమిషాలపాటు అలాగే ఉండనివ్వాలి. ఆ తరువాత మేకప్ రిమూవర్ తో తుడిచేయాలి. వెచ్చటినీళ్లతో ఫేస్ ను వాష్ చేసుకోవాలి. ఐతే, క్యాస్టర్ ఆయిల్ ను వాడేముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి.రెండు టీస్పూన్స్ హెన్నాను ఒక బౌల్ లో కలపాలి. ఆ తరువాత కొన్ని చుక్కల నిమ్మరసాన్ని మిక్స్ చేయాలి. పేస్ట్ ను తయారుచేయాలి. ఐబ్రోస్ పై అప్లై చేయాలి. నలభై నిమిషాల తరువాత వాష్ చేయాలి. అలాగే రోజుకి రెండు సార్లు కాఫీ తాగండి. కాఫీ లో వుండే కెరాటిన్ జుట్టు నల్లగా అవ్వటానికి బాగా సహాయపడుతుంది. అందువల్ల మీ ఐ బ్రోస్ నల్లగా ఒత్తుగా ఉంటాయి.ఇలాంటి మరెన్నో సౌందర్య చిట్కాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. మరెన్నో సౌందర్య చిట్కాలు తెలుసుకోండి...

మరింత సమాచారం తెలుసుకోండి: