చాలా మంది తెల్లగా అందంగా వున్నా కాని వారి పెదాలు మాత్రం నల్లగా ఉంటాయి.పెదవులు నల్లగా మారిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. ఎక్కువ కాలం ధూమపానం చేసిన వాళ్ళ పెదవులు కూడా నల్లగా అయిపోతాయి.స్మోకింగ్ పెదాలకి మంచిది కాదు. మీరు ఎక్కువగా స్మోక్ చేసేవాళ్లు అయితే దానికి దూరంగా ఉండటం మంచిది. అలానే పెదవులు పదే పదే తడపడం వల్ల కూడా డార్క్‌గా అయిపోతూ ఉంటాయి. అయితే ఇలా పెదవులు నల్లబడి పోవడంని హైపర్ పిగ్మెంటేషన్ అని అంటారు.ఎక్కువ మెలోనిన్ వల్ల ఈ సమస్య వస్తుందని నిపుణులు చెప్పడం జరిగింది. అయితే నల్లబడిపోయిన పెదవులను ఎర్రగా ఈ టిప్స్ తో మార్చుకోవచ్చు.ఆ టిప్స్ ఏంటో తెలుసుకోండి.ఈ టిప్స్ పాటిస్తే మీ పెదాలు ఎర్రగా మారిపోతాయి.


చాలా మందికి పెదాల్ని తడిపే అలవాటు ఉంటుంది. ఆస్తమాను మీరు మీ పెదవులు తడపడం వల్ల పెదవులు నల్లగా మారిపోతాయి. మీకు కనుక ఈ అలవాటు ఉంటే మానుకోవడం మంచిది తద్వారా పెదవులు అందంగా ఉంటాయి.మీ పెదవులు అందంగా ఉండాలంటే తప్పకుండా కెఫిన్‌కి దూరంగా ఉండండి. ఎక్కువగా కెఫీన్‌ని తీసుకునే వారిలో పెదవులు నల్లగా ఉంటాయని నిపుణులు చెప్పడం జరిగింది. మీరు కనుక ఎక్కువగా కెఫిన్ తీసుకునే వాళ్ళు మానేయడం మంచిది.మీ పెదవులకు విటమిన్ ఈ అప్లై చేయండి దీని వల్ల అందంగా ఉండే పెదవులు మీ సొంతం అవుతాయి.పీల్స్, లేజర్ థెరపీ, ఇంఫుసిన్ అఫ్ డిపిగ్మెంటింగ్ ఏజెంట్ ఇలాంటివి పాటించడం వల్ల మీ పెదవులు ఎర్రగా అందంగా ఉంటాయి.లిప్ స్టిక్‌ని వాడేటప్పుడు బయటికి వెళ్లి వచ్చిన వెంటనే దానిని రిమూవ్ చేసేయండి. దీని కోసం మీరు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్‌ని మీరు వాడొచ్చు. ఇలా వీరితో తొలగించడం వల్ల మీ పెదవులు నల్లబడకుండా ఉంటాయి.ఇక ఈ పద్ధతులతో మీ పెదాలు ఎర్రగా మారిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: