
ఇక ఈ ఉల్లి పేస్టుని తల మాడుకు పట్టించడం వల్ల, అక్కడ రక్తనాళాలు సరఫరా బాగా జరుగుతుంది. ఉల్లిపాయలో ఉండే " క్యాంపీఫెరాల్ అలాగే క్వర్సెటిన్" అనే రసాయనాలు జుట్టు కుదుళ్ళకు ఉండే రక్తనాళాలు వ్యాకోచం చెందేలా చేస్తాయి. అంటే రక్తనాళాలు వెడల్పు అయ్యేందుకు ఈ రసాయనాలు సహాయపడతాయన్నమాట. ఇక ఈ రక్తనాళాలు తెరుచుకోవడం వల్ల ఆక్సిజన్ సరఫరా బాగా జరిగి, జుట్టు కుదుళ్లు బలపడతాయి. ఫలితం జుట్టు రాలే సమస్య దూరం అవడంతో పాటు జుట్టు మీద ఏర్పడే చుండ్రు, రసాయనాల నుండి జుట్టును సంరక్షించుకోవచ్చు.
ఉల్లిపాయలలో సల్ఫర్ ఎక్కువగా ఉండడం వల్ల ఆ ఘాటుకి తట్టుకోలేక, మనకు కళ్ళ వెంట , ముక్కు వెంట నీళ్లు రావడం సహజం. ఇక ఎప్పుడైతే ఈ ఉల్లిపాయ పేస్ట్ ను జుట్టుకు పట్టిస్తామో , అప్పుడు జుట్టు కుదుళ్లలో వుండే కెరటోనాయిడ్స్ ఉత్పత్తిని, ఈ సల్ఫర్ వేగవంతం చేస్తుంది. ఫలితంగా కెరటిన్ కలిగిన జుట్టు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది. అలాగే యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు సమృద్ధిగా ఉల్లిపాయలో ఉండటం వల్ల, జుట్టు కుదుళ్ల మీద ఏర్పడే ఫంగస్ లేదా బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ఉల్లిపాయ బాగా పనిచేస్తుంది.