దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలవుతున్నాయి. సామాన్యులు, దినసరి కూలీలు లాక్ డౌన్ వల్ల ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉపాధి హామీ కూలీల వేతనాన్ని పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి కూలీల వేతనాన్ని 211 రూపాయల నుంచి 237 రూపాయలకు పెంచారు. ఈ నెల 1వ తేదీ నుంచి పెంచిన వేతనం వర్తిస్తుందని ప్రభుత్వం ప్రకటన చేసింది. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి వేతనాలను పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సీఎం కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఉపాధి హామీ కూలీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీ కూలీలకు ఒకేసారి 26 రూపాయలు పెంచడంపై సామాన్య ప్రజలు సైతం కేసీఆర్ ను ప్రశంసిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో 100 రోజుల పని కల్పించాలనే ఉద్దేశంతో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి