తెలుగు ఇండస్ట్రీలో సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లలో తనదైన ముద్ర వేసి డైలాగ్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు మంచు మోహన్ బాబు. కెరీర్ బిగినింగ్ లో విలన్ గా నటించి తర్వాత కమెడియన్ గా నటించి ఆ తర్వాత హీరోగా స్థిరపడ్డారు. ఎన్నో విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించారు మోహన్ బాబు.  అయితే మోహన్ బాబు కెరీర్ ఇంత మంచి స్థానంలో నిలవడానికి కృషి చేసిన మహానుభావులు దాసరి నారాయణ రావు.  ఈ విషయాన్ని ప్రతిసారి మంచు మోహన్ బాబు అంటూనే ఉన్నారు. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతి సందర్భంగా సీనియర్ నటుడు మోహన్ బాబు ట్విట్టర్ లో స్పందించారు. ఇవాళ దాసరి నారాయణ రావు గారి పుట్టినరోజు అని, ఏ లోకంలో ఉన్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

 

గురువు, తండ్రి ఒక్కటేమి అన్నీ నాకు దాసరి నారాయణ రావే అంటారు. గురువు గారి ఆశీస్సులు తన కుటుంబానికి ఉంటాయని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. "తల్లిదండ్రులు నాకు భక్తవత్సలం అని పేరుపెట్టారు. కానీ నటుడిగా నాకు జన్మను ప్రసాదించిన గురువు దాసరి నారాయణరావు గారు 'మోహన్ బాబు' అని నామకరణం చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఒక రకంగా తెలుగు ఇండస్ట్రీలో మోహన్ బాబు ఇంత మంచి స్థానంలో ఉండటానికి దాసరి కారణం అని మంచు కుటుంబ సభ్యులు ముక్త కంఠంతో అంటారు. నాకు విలన్ గా, హీరోగా, కమెడియన్ గా, క్యారక్టర్ గా ఆర్టిస్టుగా అన్ని రకాల పాత్రలు ఇచ్చి నన్ను ఇంతటివాడ్ని చేసిన మహనీయుడు, తండ్రి లాంటి వ్యక్తి దాసరి నారాయణరావు గారు  అంటూ కీర్తించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: