ఏపీలో లాక్ డౌన్ వల్ల గత రెండు నెలలుగా ప్రజా రవాణా స్తంభించడంతో పాటు రెస్టారెంట్లు, సినిమా హాళ్లు మూతపడ్డాయనే సంగతి తెలిసిందే. అయితే కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ భారీగా సడలింపులు ఇవ్వనున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రజా రవాణా, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోందని సమాచారం. ఇందుకోసం ప్రామాణిక నిర్వహణ విధానం(ఎస్ఓపీ) సిద్ధం చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించినట్టు తెలుస్తోంది. 
 
 
సీఎం జగన్ నిన్న క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. వలస కార్మికులకు రహదారి వెంట భోజనం, తాగునీరు అందేలా చూడాలని జగన్ ఆదేశించారు. రాష్ట్రానికి మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. కంటైన్మెంట్ జోన్లలో అనుసరించాల్సిన వ్యూహాల గురించి అధికారులు ప్రతిపాదనలు అందజేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: