దేశవ్యాప్తంగా అందరి దృష్టి పశ్చిమ బెంగాల్‌పై నెలకొంది. 294 స్థానాలున్న పశ్చిమ బెంగాల్‌లో 292 అసెంబ్లీ స్థానాలకు ఎనిమిది విడుతల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీజేపీ మధ్య పోటీ నువ్వానేనా అన్నవిధంగా ఎన్నికలు జరిగాయి. టీఎంసీ తరఫునమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ అన్నీ తానై ప్రచారం నిర్వహించగా.. బీజేపీ తరఫున ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ చీఫ్‌ జేపీనడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ప్రచారం చేపట్టారు. ఇరు పార్టీలు ప్రచారం హోరాహోరీగా నిర్వహించగా.. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. అటు ఎన్నికల ర్యాలీలో గాయపడిన మమత కూడా ఏమాత్రం తగ్గకుండా వీల్‌చైర్‌లోనే ప్రచార పర్వాన్ని కొనసాగించి బెంగాల్‌  ఓటర్ల మనసు గెల్చుకునేందుకు ప్రయత్నించారు.
 
దీంతో బెంగాల్‌ బెబ్బులి అంటూ ఆమెపై ప్రశంసలు వెల్లువెత్తాయి.  బెంగాల్‌లో అత్యధిక స్థానాల్లో అధికార టీఎంసీ లీడ్‌లో కొనసాగుతోంది. అధికారిక ట్రెండ్స్ ప్రకారం.. టీఎంసీ 206, బీజేపీ 83 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. తాజాగా 200 పైగా స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంతో టీఎంసీ దూసుకుపోతున్న క్రమంలో మమతపై సోషల్‌ మీడియాలో మీమ్స్‌ హల్‌చల్‌ చేస్తున్నాయి. బెంగాలీలు దుర్గా మాత ఆరాధకులంటూ వ్యాఖ్యలు వెల్లువెత్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: