మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ నందమూరి హీరో ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమా నుంచి తాజాగా కీలక అప్డేట్ వచ్చేసింది. కేవలం సాంగ్స్ మినహా మిగతా షూటింగ్ అంతా పూర్తయిందని ఈరోజు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సంధ‌ర్భంగా రిలీజ్ చేసిన ఫోటోలో చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ బైక్ పై దూసుకెళుతున్నారు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ రెండు భాషలకు సంబంధించిన డబ్బింగ్ కూడా పూర్తి చేశారని ఈ ప్రకటనలో వెల్లడించారు. 

ఇక తాజా అప్డేట్ తో ఈ సినిమా ప్రకటించిన తేదీకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రచారం మొదలైంది.  మరి ఈ విషయం మీద ఆర్ఆర్ఆర్ యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు. మరి దానికి సంబంధించిన ప్రకటన ఏదైనా వస్తుందా లేదా అనే దాని మీద కూడా క్లారిటీ లేదు.. చివరిగా ప్రకటించిన దాని ప్రకారం ఈ సినిమా అక్టోబర్ 13వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: