పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా విడుదలైన దాదాపు రెండేళ్లు అవుతోంది. 2019లో వచ్చిన "సాహో" వారిని నిరాశ పరిచింది. దీంతో ప్రభాస్ నెక్స్ట్ మూవీ గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ రోజు "రాధేశ్యామ్" చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము అంటూ ప్రకటించారు. దీంతో రెబల్ స్టార్ అభిమానుల సంబరాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా నటించిన పూజాహెగ్డే చేసిన ట్వీట్ ను భారీ సంఖ్యలో రీట్వీట్ చేస్తున్నారు అభిమానులు. "ఈ రోజు ఈ అప్డేట్ తోనే నిద్ర లేచాను. నాకు ఇష్టమైన పండగ రోజున రాధేశ్యామ్ రాబోతోంది. సంక్రాంతి నాకు లక్కీ పండగ. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను... ఈ సినిమాలోని పాత్రలో నా ప్రాణం, ఆత్మ రెండూ పెట్టి నటించాను" అంటూ ట్వీటీ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: