హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు కొన్ని శబ్దాల దెబ్బకు అల్లాడిపోతున్నారు. మెట్రో కోసం ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు అదే మెట్రో దెబ్బకు కంగారు పడే పరిస్థితి వచ్చింది. కొన్ని రోజులుగా మెట్రో లైన్ సమీపంలో ఉన్న కాలనీల ప్రజలకు విపరీతమైన శబ్ధాలు వస్తున్నాయి. రైళ్లు ట్రాక్ పై వెళ్ళేటప్పుడు రాపిడితో ధ్వనులు వస్తున్నాయి. రాత్రి వేళల్లో మెట్రో శబ్దాలకు చెవులు పగిలిపోతున్నాయని స్థానికులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.

వర్షాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువ ఉంటుందని స్ధానికులు అంటున్నారు. మెట్రో చక్రాలకు, ట్రాక్ మధ్య గ్రైండింగ్ సరిగ్గా లేకపోవడం వల్లే ఈ సమస్య వస్తుంది అని దీనిపై స్పందించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. బోయ గూడా, గ్రీన్ ల్యాండ్, మధురానగర్, యూసుఫ్ గూడా, మాదాపూర్ మెట్రో లైన్ మార్గాల్లో భారీ శబ్దాలు వస్తున్నాయని గుర్తించారు. దీనీపై హెచ్ఏంఆర్ అధికారులకు  ఫిర్యాదు చేసిన సికింద్రాబాద్ బోయ గూడా ప్రాంత వాసులు... చర్యలు తీసుకోవాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: