నాలుగు వాహనాలు ఢీ..  తొమ్మది మంది మృతి

హరియాణా రాష్ట్రం బద్దీ వద్ద  శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మది మంది అక్కడికక్కడే మృతి చెందారు. వీరిలో ఎనిమిది మంది ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా భావిస్తున్నారు. నాలుగు వాహనాలు  ఒకదానితో ఒకటి ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది.
కుంద్లీ-మేసర్- పాల్వాల్ ఎక్సెప్రెస్ హైవే పై బహదూర్ ఘడ్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. రాజస్థాన్ నుంచి ఉత్తర ప్రదేశ్ కు పదకుండు మందితో వెళుతున్న మారుతీ ఎర్జిక వాహనాన్ని డ్రైవర్ కాలకృత్యాలు తీర్చుకునే నిమిత్తం  రహదారిపై  ఓ లారి వెనుక వైపు ఆపాడు. లారీ డ్రైవర్ వెనుక ఉన్న వాహనాన్ని చూసు కోకుండా తన  వాహనాన్ని రివర్స్ చేశాడు. ఈ ఘటనలో  కారులో ఉన్న ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనను  చూసిన మరో వాహనం లోని వ్యక్తులు క్షతగాత్రులను రక్షించాలని భావించి తమ వాహనాన్ని రోడ్డు పై నిలిపారు. ఆ వాహనాన్ని వెనుక వస్తున్న మరో లారీ ఢీ కొనింది. ఈ ఘటనలో మరో ఏడుగురు  గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి కూడా ఉన్నారని, పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసు అధికారి ఓం ప్రకాష్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: