తెలంగాణ రాష్ట్రంలో గ‌త రెండు రోజుల నుంచి వ‌రుస‌గా మందుబాబులు ఫూటుగా మ‌ద్యం సేవించి రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకుంటున్నారు. సోమ‌వారం ఒక్క‌రోజే బంజారాహిల్స్‌, నార్సింగి వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో న‌లుగురు మృతి చెందిన విష‌యం విధిత‌మే. దీంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మై అక్క‌డ‌క్క‌డ రోడ్డు పై త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు.

ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో  కొంతమంది యువకులు ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా వాహనాలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు నడుపుతున్నారు. పోలీస్ చలాన్లు తప్పించుకునేందుకు వాహనాల నెంబర్ ప్లేట్లకు మాస్కులు తగిలించి రోడ్లపైకి వస్తున్నారు. అదేవిధంగా అతివేగంగా నడుపుతూ స‌మీప‌ వాహనాదారులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇలాంటి వారిపై నగర పోలీసులు  తాజాగా ప్ర‌త్యేక దృష్టి సారించారు. నెంబర్ ప్లేట్ కనిపించకుండా మాస్క్‌ని తొడుగుతున్న వాహనచోదకుల మీద ముఖ్యంగా పోలీసులు సెటైర్ వేస్తూ ట్వీట్ చేసారు. వీరంద‌రూ కొత్త వేరియంట్ బాధితులు, వీరిని సరైన ఐపీసీ సెక్షన్లతో ట్రీట్ చేయాల్సి ఉంది అని ఫన్నీగా ట్వీట్ చేసారు హైదరాబాద్ పోలీసులు.  పోలీసులు చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన‌ది.

మరింత సమాచారం తెలుసుకోండి: