ఇంద్రకీలాద్రి పై భవాని దీక్షల విరమణలు ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న దీక్షా విరమణల కోసం పటిష్ట ఏర్పాట్లు చేశారు. కరోనా తరువాత జరుగుతున్న దీక్షలు కావడంతో 7లక్షల పైగా అమ్మవారి దర్శనార్ధం భవానీలు రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఉదయం 6 గంటలకు దీక్షల విరమణలు ప్రారంభమైంది.. 6:30కు హోమగుండాలు ప్రారంభమయ్యాయి. 3 హోమగుండాలను వెలిగించి దీక్షలను ఈవో భ్రమరాంబ, వైదిక కమిటీ సభ్యులు ప్రారంభించారు.


భవానిల కోసం తాత్కాలిక షెడ్లు, కేశ ఖండన శాలలు ఏర్పాటు చేశారు. వినాయకుని గుడి నుంచి అమ్మవారి సన్నిధి వరకు 5 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రి కొండ చుట్టూ గిరి ప్రదక్షణ కు అనుమతి ఇచ్చారు. 10 కౌంటర్ల ద్వారా  ప్రసాదాలు అందిస్తున్నారు. భవానీల కోసం 20లక్షల లడ్డూలు సిద్దం చేశారు. సీతమ్మవారి పాదాలు, భవాని ఘాట్, పున్నమి  ఘాట్ ల వద్ద జల్లు స్నానాలు ఏర్పాటు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: