భారాస పార్టీలో బిసి మహిళలకు సముచిత స్థానం లభించడం లేదని ఏకంగా  ఆ పార్టీ మహిళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లింగాల శోభారాణి ఆరోపించారు. పార్టీ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఆమె  హైదరాబాద్  గన్ పార్క్ అమరవీరుల స్థూపం ముందు ఆందోళనకు దిగారు. భారాసా  ప్రకటించిన ఎమ్మెల్యే సీట్లలో ఒక్క బీసీ మహిళకు కూడా అవకాశం కల్పించలేదని ఆమె అంటున్నారు. ఉద్యమం సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట ఉన్న బీసీ మహిళలను విస్మరించారని లింగాల శోభారాణి మండిపడ్డారు.


ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి తమ గోడును చెప్పుకునేందుకు యత్నించిన కుదరడం లేదని లింగాల శోభారాణి అన్నారు. భారాస పార్టీలో అగ్రవర్ణాలకు చెందిన మహిళలకు మాత్రమే అవకాశాలు లభిస్తాయని.. గతంలో జరిగిన రెండు పర్యాయాల ఎన్నికల్లో బిసి మహిళలకు అన్యాయం జరిగిందని లింగాల శోభారాణి అన్నారు. త్యాగాలు తాము చేస్తుంటే... భోగాలు అగ్రవర్ణాల మహిళలు అనుభవిస్తున్నారని లింగాల శోభారాణి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

brs