తెలంగాణలో గతంలో వచ్చిన ఆధిపత్యాన్ని మళ్లీ నెలకొల్పుకునేలా బీజేపీ ప్లాన్ చేస్తోంది. పార్లమెంట్‌ ఎన్నికల్లో అత్యధిక సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ ఈ నెల 20 నుంచి విజయ సంకల్ప యాత్రలు చేపట్టబోతోంది.  ఈ నెల 20న ఐదు చోట్ల నుంచి యాత్రలు ప్రారంభంకానున్నాయి. లోక్‌సభ ఎన్నికల ముందు జరుగుతున్న రథయాత్రలను విజయవంతం చేయాలని కిషన్‌ రెడ్డి నేతలకు మార్ధనిర్ధేశనం చేశారు.


ఈ యాత్రల నిర్వహణపై తాజాగా విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ రాష్ర్ట కార్యాలయంలో కిషన్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఐదు యాత్రల బాధ్యులు హాజరయ్యారు. దిల్లీలో జాతీయ కౌన్సిల్‌ సమావేశాలు ఉండటంతో ముందే ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని పార్టీ శ్రేణులకు కిషన్‌ రెడ్డి దిశానిర్ధేశం చేశారు. ఏ ఒక్క గ్రామంలో యాత్ర విఫలంకావద్ధని.. ఇది పార్టీపై ప్రభావం చూపుతుందని కిషన్‌ రెడ్డి హెచ్చరించారు. యాత్రను విజయవంతం చేయలేకపోతే అప్పగించిన బాధ్యతల నుంచి తప్పుకోవాలని కిషన్‌ రెడ్డి సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

bjp