ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం శుభవార్త చెప్పింది. భారీగా గ్రాట్యుటీ పెంచుతూ  నిర్ణయం తీసుకుంది. కానీ ఈ నిర్ణయం కేవలం నవోదయ విద్యాలయ సమితి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి సంస్థలలో నవోదయ విద్యాలయ సమితి ఒకటి. ఈ సమితిలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం గ్రాట్యుటీని రెట్టింపు చేసింది. 
 
గతంలో 10 లక్షల రూపాయలుగా ఉన్న గ్రాట్యుటీ పరిమితిని కేంద్రం 20 లక్షల రూపాయలకు పెంచింది. ఫిబ్రవరి 24న కేంద్రం గ్రాట్యుటీ పరిమితి పెంపుకు సంబంధించిన నోటిఫికేషన్ ను జారీ చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయం 2004 జనవరి 1కి ముందు ఉద్యోగంలో చేరిన వారికి వర్తిస్తుంది. కేంద్రం గ్రాట్యుటీ పెంపుతో పాటు మరో నిర్ణయం కూడా తీసుకుంది. నవోదయ ఉద్యోగ సమితి పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ రూల్స్ 2007 ను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 
 
2004 జనవరి 1ముందు ఉద్యోగంలో చేరిన ఉద్యోగులకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుటీ యాక్ట్ 1972 నిబంధనలు వర్తిస్తాయి. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు 20లక్షల రూపాయల వరకు షరతులకు లోబడి పన్ను మినహాయింపును పొందవచ్చు. గతంలో ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదాయపు పన్నుపై మినహాయింపును 20 లక్షల రూపాయలకు పెంచింది. ఆర్థిక అంశాలు, ఉద్యోగి సామర్థ్యం ఆధారంగా కేంద్రం గ్రాట్యుటీ మొత్తాన్ని పెంచుతోంది. కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో నవోదయ ఉద్యోగ సమితి ఉద్యోగులకు ప్రయోజనం కలగనుంది 

మరింత సమాచారం తెలుసుకోండి: