దేశ‌వ్యాప్తంగా క‌రోనా వైర‌స్ విజృంభిస్తోన్న నేప‌థ్యంలో ఎక్క‌డిక్క‌డ క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. లాక్‌డౌన్లు జ‌రుగుతున్నాయి. ఇప్పుడు క‌రోనా వైర‌స్ ప్ర‌భావం బ్యాకింగ్ రంగంపై సైతం ప‌డింది. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబీఏ) జనతా కర్ఫ్యూ నేపథ్యంలో కస్టమర్లకు అందించే బ్యాంకింగ్ సర్వీసులకు అంతరాయం లేకుండా చూస్తామని భరోసా ఇచ్చింది. కరోనా వైర‌స్ వ‌ల్ల దేశ‌మే క‌కావిక‌లం అవుతోన్న నేప‌థ్యంలో ఇప్పుడు బ్యాకింగ్ రంగంలో ఎవ్వ‌రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల‌ని అన్ని బ్యాంకులు ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశాయి.



ఈ క్ర‌మంలోనే క‌స్ట‌మ‌ర్ల‌కు ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కొన్ని సూచ‌న‌లు కూడా చేస్తోంది. అత్య‌వ‌స‌రం అయితే తప్ప బ్యాంక్ బ్రాంచులక రావొద్దు. ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్యలనే మా ఉద్యోగులు కూడా ఎదుర్కొంటున్నారు. అందువల్ల మాకు కూడా మీ సాయం కావాలి అని వివ‌రించింది. అయితే బ్యాకింగ్ స‌ర్వీసులు అన్ని ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయ‌ని.. ఇక మొబైల్ లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్ ద్వారా నాన్ ఎసెన్షియల్ సర్వీసులను పొందొచ్చని సూచించింది

.

ఇక అత్య‌వ‌స‌రం అయితే బ్రాంచ్‌ల‌కు సైతం కాల్ చేయ‌వ‌చ్చ‌ని సూచించింది. ఇక సోమ‌వారం నుంచి అన్ని బ్యాంకులు కూడా కొన్ని స‌ర్వీసులు క‌చ్చితంగా క‌స్ట‌మ‌ర్ల‌కు అందుబాటులో ఉండాల‌ని సూచించింది. క్యాష్ డిపాజిట్లు, క్యాష్ విత్‌డ్రాయెల్స్, చెక్ క్లియరింగ్, రెమిటెన్స్‌లు, గవర్నమెంట్ ట్రాన్సాక్షన్లు వంటి సేవలు తప్పక అందుబాటులో ఉంటాయని పేర్కొంది. నాన్ ఎసెన్షియల్ సర్వీసులు అందుబాటులో ఉండకపోవచ్చని తెలిపింది. ఈ నిబంధ‌న‌ల నేప‌థ్యంలో బ్యాంక్ క‌స్ట‌మ‌ర్లు అంద‌రూ వీటిని గ‌మ‌నించి ముందుగా జాగ్ర‌త్త ప‌డాల‌ని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: