డబ్బు సంపాదించాలని ఎవరికీ మాత్రం ఉండదు. రిస్క్ తీసుకునే వారు అదిరిపోయే లాభం కోసం స్టాక్స్‌లో డబ్బులు పెట్టొచ్చునని నిపుణులు తెలిపారు. అయితే దీర్ఘకాలంలో ఈ క్విటీ మార్కెట్లు ఇన్వెస్టర్లకు అదిరిపోయే రాబడిని అందించాయని నిపుణులు తెలియజేశారు. అందువల్ల రిస్క్ తీసుకునే వారు దీర్ఘకాల లక్ష్యంతో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చునన్నారు. అయితే అన్ని స్టాక్స్ ఒకేరకమైన రాబడి అందిచవు. అందువల్ల మల్టీబ్యాగర్ స్టాక్స్‌ను పట్టుకోవాలి. వాటిల్లో డబ్బులు పెట్టాలి.

 

 

గత ఐదేళ్లలో అదిరిపోయే రాబడి అందించిన కొన్ని స్టాక్స్ గురించి తెలుసుకుందాం మరి. టేస్టీ బైట్ ఇటేబుల్ అనే స్టాక్ గత ఐదేళ్లలో 792 శాతం రాబడి అందించింది. దీని ధర ఇప్పుడు రూ.11,550 వద్ద కదలాడుతోంది. ఈ షేరు ధర రూ.14 వేలకు కూడా చేరింది. షేరు ధర గత ఐదేళ్లలో రూ.10 వేలకు పైగా పెరిగింది. అంటే మీరు ఈ షేరులో ఐదేళ్ల కిందట రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మీకు రూ.9 లక్షలు వచ్చేవి అని తెలిపారు.

 

 

ఇంకా మిందా ఇండస్ట్రీస్ షేరు కూడా గత ఐదేళ్లలో 789 శాతం పరుగులు పెట్టింది. ప్రస్తుతం ఈ షేరు ధర రూ.300 సమీపంలో కదలాడుతోంది. మీరు షేరులో ఐదేళ్ల కిందట రూ.లక్ష పెట్టి ఉంటే.. ఇప్పుడు మీకు రూ.9 లక్షలు వచ్చేవి. ఎస్కార్ట్స్ షేరు ధర కూడా ఐదేళ్లలో 755 శాతం ర్యాలీ చేసింది.

 

 

అయితే ప్రస్తుత ధర రూ.1140 సమీపంలో కదలాడుతోంది. ఈ షేరులో మీరు 5 ఏళ్ల కిందట రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మీకు రూ.8.5 లక్షలు వచ్చి ఉండేవి. ఇక నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ షేరు కూడా గత ఐదేళ్లలో 708 శాతం పరుగులు పెట్టింది. దీని ధర ఇప్పుడు రూ.1820 సమీపంలో ఉంది. ఈ షేరులో ఐదేళ్ల కింద రూ.లక్ష పెట్టి ఉంటే ఇప్పుడు మీకు రూ.8 లక్షలు వచ్చేవి.

మరింత సమాచారం తెలుసుకోండి: