దేశంలో ఉన్న అతి పెద్ద ఆన్లైన్ వ్యాపార సంస్థ అయినటువంటి ఫ్లిప్ కార్ట్, మేడ్ ఇన్ ఇండియా నినాదంతో కొత్తగా నోకియా కంపెనీ స్మార్ట్ ఏసీలను లాంచ్ చేసింది. ప్రముఖ మొబైల్ దిగ్గజ సంస్థ అయినటువంటి నోకియా లాంచ్ చేసిన మొదటి ఏసీ ఇదే. అయితే దీని ధరను రూ.30,999గా నిర్ణయించారు. ఇక ఫ్లిప్ కార్ట్‌ లో డిసెంబర్ 29వ తేదీ నుంచి వీటి సేల్ మొదలు కానుంది. ఇక ఈ నోకియా స్మార్ట్ ఏసీల్లో ఎన్నో ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. అడ్జస్ట్ చేసుకోవడానికి సరిపోయే ఇన్వర్టర్ మోడ్, పర్యావరణ హితమైన ఆర్-32 రిఫ్రెజరెంట్, ఇంటెలిజెంట్ మోషన్ సెన్సార్లు, వైఫై ద్వారా కనెక్ట్ అయిన స్మార్ట్ క్లైమెట్ కంట్రోల్ వంటి ఫీచర్ల ద్వారా కేవలం చల్లదనాన్ని మించిన అనుభవాన్ని ఈ స్మార్ట్ ఏసీలు అందించనున్నారు.
 


ఈ ఏసీలో ఒక హిడెన్ డిస్ ప్లే కూడా ఉండనుంది. ఏసీని ఆన్ చేసినప్పుడు మాత్రమే ఈ డిస్ ప్లే వెలుగుతుంది. ట్రిపుల్ ఇన్వర్టర్ టెక్నాలజీ, బ్రష్ లెస్ డీసీ మోటార్లు, డ్యూయల్ రోటరీ కంప్రెసర్ వంటివి కూడా దీని ద్వారా లభించనున్నాయి. దీని ద్వారా ఏసీ శబ్దం లేకుండా పనిచేస్తుంది. తనని తానే శుభ్రం చేసుకునే టెక్నాలజీ కూడా ఇందులో ఉంది. 6-ఇన్-1 ఫిల్టర్లు, యాంటీ-మైక్రో బయల్ అయనైజర్ కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో ఉన్న 4-ఇన్-1 అడ్జస్టబుల్ టన్నేజ్ ద్వారా ఏసీ చిన్న రూంని తక్కువ పవర్‌తో కూల్ చేయగలదు. ఇది స్మార్ట్ ఏసీ కాబట్టి స్మార్ట్ హోం+ యాప్ ద్వారా మీరు ఈ ఏసీని ఆఫ్/ఆన్ చేయవచ్చు. ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు, మోడ్స్‌ను మార్చవచ్చు. మొబైల్ యాప్ ద్వారా ఫిల్టర్ క్లీన్ చేయాల్సి వచ్చినప్పుడు, సమస్యలు ఎదురయినప్పుడు, ఆన్/ఆఫ్ షెడ్యూల్ చేయాల్సి వచ్చినప్పుడు మొబైల్ యాప్ ద్వారా నోటిఫికేషన్లు కూడా పంపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: