
1. సర్జికల్ కాటన్ రోల్స్ తయారీ:
ముఖ్యంగా హెల్త్ సెంటర్ లో ఏదైనా బిజినెస్ అంటే ఎప్పటికీ నష్టం లేని వ్యాపారం అని గుర్తుపెట్టుకోవాలి. ఇక ఈ సర్జికల్ కాటన్ రోల్స్ వ్యాపారం అనేది ఎప్పటికీ నష్టం రాదు. కాబట్టి మార్కెట్లో వీటిని తయారు చేసే మెషిన్ లక్ష 50 వేల రూపాయల వరకు ఉంటుంది. ఇక వీటికి రా మెటీరియల్స్ సపరేట్ గా తీసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో కరెక్ట్ హోల్సేల్ వ్యాపారస్తులను కలసి, ఈ వ్యాపారం మొదలు పెడితే కచ్చితంగా లాభాలు రెట్టింపు స్థాయిలో ఉంటాయి.
2. డస్ట్ లెస్ చాక్ పీస్:
ఒకప్పుడు ఈ చాక్ పీస్ ల నుంచి ఎక్కువ డస్ట్ రావడంతో టీచర్లకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే వి. ప్రస్తుతం ఈ డస్ట్ లెస్ చాక్ పీస్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వీటి నుంచి ఎలాంటి డస్ట్ వెలువడదు. కాబట్టి వీటికి డిమాండ్ బాగా ఉందని చెప్పవచ్చు. స్కూల్స్ కి , కాలేజెస్ కి ఈ చాక్ పీస్ ల అవసరం ఎంతో ఉంటుంది. కాబట్టి వీటిని తయారు చేసి అమ్మడం వల్ల, వీటి నుంచి వచ్చే ఆదాయం కూడా రెట్టింపు స్థాయిలోనే ఉంటుంది.
3. మేకుల తయారీ:
ఇంటి నిర్మాణంలో ఈ కార్పెంటర్ వర్క్ ఎక్కువగా వాడతారు.ఇక ప్రతి ఒక్కరి కల సొంత ఇల్లు అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక ఈ మేకులకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే ఈ మేకులను తయారుచేసే మెషిన్ ధర సుమారు రూ.2,50,000 నుంచి రూ. 5 లక్షల మధ్య వుంటుంది. కాబట్టి ఇది కూడా ఎప్పటికీ డిమాండ్ తగ్గని వ్యాపారం.