దేశం నుండి ఎగుమతులు సాధారణంగానే జరుగుతూ ఉంటాయి. మన ఉత్పత్తులు కూడా కొందరికి ప్రియమైనవి ఉంటాయి. వాటిని ఆయా దేశాలు ఇక్కడ నుండి దిగుమతి చేసుకోవడం ద్వారా వాటిని ఆస్వాదిస్తూ ఉంటారు. మన దేశం నుండి ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తులు ఎక్కువగా ఎగుమతి అవుతుంటాయి. అందులోను ఏపీలో మామిడి, మిరప వంటివాటికి విదేశాలలో మంచి డిమాండ్ ఉంది. ఇంకా రాష్ట్రంలో ఆక్వా ఉత్పత్తులకు ప్రోత్సహకాలు ఇస్తుండటంతో ఇక్కడ అదొక పెద్ద హబ్ గా మారిపోయింది. దీనితో ఇక్కడ ఇదొక ముఖ్య ఆదాయ వనరుగా మారింది. ఆక్వా సాగులో చేపలు, రొయ్యలు రైతులకు లాభదాయకంగా ఉంటున్నాయి.

దేశంలోనే ఆక్వా ఉత్పత్తిలో రాష్ట్రము ప్రధమ స్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఆక్వా ఎగుమతులతో కూడా రాష్ట్రానిదే పైచేయి. విదేశాలలో రొయ్యలకు బాగా డిమాండ్ ఉంది. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు మన రొయ్యలంటే బాగా ఇష్టపడతారు. అందుకే రాష్ట్రం నుండి మూడు వంతుల ఈ ఎగుమతులు అమెరికాకే వెళ్తుంటాయి. కరోనా సమయంలో దీనిపై కాస్త ప్రభావం పడినప్పటికీ మళ్ళీ పుంజుకుంటుంది. కేవలం ఈ ఏడాది భారత్ నుండి 43717.26 కోట్ల విలువైన 11.5 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయబడ్డాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఎగుమతులు 10.81 శాతం ఎక్కువే.  ఇందులో ఏపీ మాత్రమే 15832 కోట్ల విలువైన 293314 టన్నుల ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి చేసింది.

భారత్ లో ఎగుమతి చేస్తున్న మొత్తం ఆక్వా ఉత్పత్తులలో 36 శాతం ఏపీ నుండే జరుగుతున్నాయి. ఈ విషయంలో ఏపీ మొదటి స్థానంలో ఉంది. తరువాత స్థానాలలో తమిళనాడు(13శాతం), కేరళ(10శాతం), గుజరాత్ ఉన్నాయి. ఎగుమతుల విలువ విషయంలోనూ ఏపీ 24 శాతం తో ప్రధమ స్థానంలోనే ఉంది. తరువాతి స్థానాలలో గుజరాత్, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఉన్నాయి. ఇక ఆయా దేశాలలో మన ఆక్వా ఎగుమతుల వివరాలు ఇలా ఉన్నాయి.. అమెరికాకు 25శాతం, చైనాకు 19శాతం, ఈస్ట్ ఏషియా కు 13శాతం, యూరప్ కు 13 శాతం, జపాన్ కు 8 శాతం, మిడిల్ ఈస్ట్ కు 2శాతం, ఇతర దేశాలకు 12శాతం ఎగుమతులు చేస్తున్నాము. మొత్తం దేశంలో ని 10 పోర్టుల ద్వారా జరిగే ఎగుమతులతో 16124.92 కోట్ల విలువైన; 280687 టన్నుల ఆక్వా ఎగుమతులు ఏపీ పోర్టుల నుండే జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: