టమాట.. టమాట.. టమాట.. ఎక్కడ చూసినా ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది  సామాన్యులందరూ కూడా ఈ ఎర్రటి టమోటా వైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడిపోతున్నారు. దీనికి కారణం టమాటా రేట్లు కొండెక్కి కూర్చోవడమే. ఇక ఇటీవల కాలంలో పెరిగిపోయిన టమాటా రేట్లు చూస్తే టమాటా అంటే కేవలం సంపన్నులకు మాత్రమే అందుబాటులో ఉంది అన్నది అర్థమవుతుంది. ఎందుకంటే ఇక రేట్లు క్రమ క్రమంగా పెరిగిపోతూ ఉండడంతో టమాటా సామాన్యుడి వంట గదికి పూర్తిగా దూరమైపోతుంది అని చెప్పాలి.



 అయితే మొన్నటి వరకు 100 రూపాయలు నుంచి 150 రూపాయలు వరకు కిలో టమాటా ధర పలికింది. సరే కొన్ని రోజులు పెరుగుతుంది.. ఆ తర్వాత మళ్లీ సాధారణ స్థితికి వస్తుందిలే అని సామాన్యులు అనుకున్నారు. కానీ టమాటా ధరలు అంతకంతకు పెరిగిపోతున్నాయి తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టడం లేదు. వెరసి ఎంతో మంది సామాన్యులు ఇక రోజువారి వంటల్లో టమాటా లేకుండానే అన్ని కానిచ్చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికే సెంచరీ కొట్టి సాధారణ ప్రజలందరిని కూడా బెంబేలెత్తిస్తున్న టమాటా ఇక ఇప్పుడూ డబుల్ సెంచరీ కొట్టేసింది అన్నది తెలుస్తుంది.


 ఏకంగా 200 రూపాయలకు పైగానే కిలో టమాటా ధర పలుకుతూ ఉండడం గమనార్హం.  దీంతో ఏం చేయాలో తెలియని దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారు సామాన్యులు. ఇటీవల ఏపీలోని అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గం లోని అంగళ్లు మార్కెట్లో నాణ్యమైన టమాటా రికార్డు స్థాయిలో ధర పలికింది అని చెప్పాలి. ఏకంగా కిలో 224 రూపాయలు పలికింది. ఇక అనంతపురం జిల్లాలోనూ టమాటా ధర డబుల్ సెంచరీ కొట్టేసింది. ఏకంగా నాణ్యమైన టమాటా ధర కిలో 215 రూపాయలు పలికింది. తక్కలపల్లి టమాటా మండలం 15 కిలోల బుట్ట మార్కెట్ చరిత్రలో ఎప్పుడు లేనట్లుగా 3200 అమ్ముడుపోయిందని అక్కడి వ్యాపారాలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: