రోడ్డుమీద గల్లీలలో జనాల మధ్య గొడవ జరగడం ఎన్నోసార్లు చూశాం. ఇలా ఏకంగా చిన్నచిన్న కారణాలకి జనాలు దారుణంగా.. కొట్టుకోవడం లాంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలాసార్లు వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. అంతేకాకుండా బస్సు, రైలు ప్రయాణాలు చేసేటప్పుడు కూడా ప్రయాణికుల మధ్య ఇలాంటి గొడవలు జరగడం లాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే బస్సు రైలులో ప్రయాణిస్తున్న వారు ఇలాగొడవపడతారు కానీ.. విమానాల్లో కాస్త ఎక్కువ ఖర్చుతో ప్రయాణించే వారు హుందా గానే ప్రవర్తిస్తారని ఇన్నాళ్లు జనాలు అనుకునేవారు.



 కానీ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులు సైతం వీధి రౌడీల్లాగానే ప్రవర్తిస్తూ ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడం చేస్తుంటారని ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చిన ఘటనల ద్వారా ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మొన్నటి వరకు ఏకంగా ప్రయాణికులు విమానంలో కొట్టుకున్న వీడియోలు వైరల్ గా మారిపోయాయి. ఇక ఇప్పుడు ఏకంగా విమానాశ్రయంలో రెండు గ్రూపులు దారుణంగా కొట్టుకున్న వీడియో ఒకటి ట్విట్టర్ వేదిక వైరల్ గా మారగా ఇది చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇంతకీ ఇది ఎక్కడో కాదు సెక్యూరిటీ అధికంగా ఉండే అమెరికాలొ.



 చికాగోలోని హెయిర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో ఈ ఘటన జరిగింది. విమానం దిగివస్తుండగా ప్రయాణికుల మధ్య మాట పెరిగి పెద్ద గొడవకు దారితీసింది. ఈ క్రమంలోనే ఒక మహిళపై ఇద్దరు వ్యక్తులు దాడి చేయడంతో గొడవ మొదలైంది. ఇక ఈ గొడవలో రెండు గ్రూపులు దారుణంగా కొట్టుకున్నాయి అని చెప్పాలి. మహిళలు ఒకరి జుట్టు ఒకరు పట్టుకొని దారుణంగా కొట్టుకుంటే ఇక కొంతమంది వ్యక్తులు దారుణంగా తన్నుకున్నారు. ఇక పక్కనే ఉన్న ఒక వ్యక్తి వీరిని ఆపడం మానేసి.. ఇదంతా వీడియో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారిపోయింది. ఇక వీరిని బాక్సింగ్ పోటీలకు పంపిస్తే గోల్డ్ మెడల్ వస్తుందని కొంతమంది నేటిజన్స్  ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: