చికెన్ తో ఎప్పుడన్నా ఇలాంటి టేస్టీ రెసిపీని రుచి చూసారా.మేము చెప్పే విధంగా చికెన్ తో ఖీమా బాల్స్ తయారు చేసి చూడండి.ఇవి తినడానికి చాలా రుచికరంగా ఉంటాయి.స్నాక్స్ లా కూడా వీటిని తినవచ్చు.మరి చికెన్ ఖీమా బాల్స్ ఎలా తయారుచేయాలో చూద్దామా. !

కావలసిన పదార్దాలు :

బోన్ లెస్ చికెన్ – ½ kg

అల్లం వెల్లుల్లి పేస్టు – 1 స్పూన్

కార్న్ ఫ్లోర్ – ¼ కప్

కోడి గుడ్డు – 1

నూనె -సరిపడా  

ఉప్పు - రుచికి సరిపడా

పసుపు – ¼ స్పూన్

కారం – 1 స్పూన్

ధనియాల పొడి – 1 స్పూన్

గరం మసాలా – 1 స్పూన్

చికెన్ మసాలా – ½ స్పూన్

నిమ్మకాయ – 1

కొత్తిమీర –కొద్దిగా

 తయారీ విధానం :

ముందుగా బోన్ లెస్ చికెన్ ని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా నీటిలో కడగాలి. ఆ తరువాత చికెన్ లోని నీరు అంతా వొంపెసి  మిక్సి జార్ లో వేసి కొద్దిగా మెత్తగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్ లోకి తీసుకొండి. దీనినే మనం  చికెన్ ఖీమా అని అంటాము. ఈ చికెన్ ఖీమాలో కొద్దిగా  అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా పొడి, చికెన్ మసాలా, కొత్తిమీర తురుము,కార్న్ ఫ్లోర్, కోడిగుడ్డు వేసి బాగా కలపండి.ఇప్పుడు ఒక అరగంట పాటు ఈ మిశ్రమాన్ని నానా నివ్వండి. తరువాత స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి.ఆ తరువాత ఖీమా పిండి మిశ్రమాన్ని చేతితో తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి.


నూనె వేడి ఎక్కిన తరువాత ఈ ఖీమా బాల్స్ ను ఒక్కొక్కటి గా నూనెలో వేసి వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే ఖీమా బాల్స్ ను వేపుకోవాలి.లైట్ గోల్డెన్ కలర్ కి వచ్చే వరకు వేయించాలి.ఇవి వేగిన తరువాత వీటిని ఒక ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. టొమోటో సాస్ గాని చిల్లి సాస్ గాని వేసుకుని తింటే చాలా రుచికరంగా ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: