రాష్ట్రంలో  భూ కుంభకోణం కబ్జాలు  రోజురోజుకు పెరిగిపోతున్నాయి. రైతుబంధు  వచ్చినప్పటి నుంచి చాలామంది రైతుబంధు కోసం అయినా దొంగ పట్టాలు పొంది  ఈ పథకం ద్వారా డబ్బులు తీసుకుంటున్నారు. ఇలాంటి ఉదంతమే మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. కొంతమంది  లీడర్లు, మరియు రెవెన్యూ అధికారులు కలిసి  3 గుంటలు ఉన్న భూమిని ఏకంగా 200 ఎకరాలకు పట్టాలు ఇచ్చిండ్రు. ఒకటి కాదు రెండు కాదు  52 దొంగ పట్టాలు తయారు చేసిండ్రు. వాటిని ఉపయోగించి లక్ష రూపాయల క్రాప్ లోన్ లు, ఇతరాత్ర లోన్లు  తీసుకుంటున్నారు. వీటితో పాటుగా  ఏడాదికి రెండు సార్లు రైతు బంధు తీసుకుంటున్నారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా  ఎవరికి అనుమానం రాకుండా  కథ నడుస్తుంది. ఇదంతా  కొంత మంది అవినీతి రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే  నడుస్తోందని తెలుస్తోంది.

వివరాల్లోకి వెళితే మంచిర్యాల జిల్లా చెందిన కన్నెపల్లి మండలానికి చెందిన  జజ్జర్వెల్లి గ్రామంలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇదే మండలానికి చెందిన  కొంతమంది రూలింగ్ పార్టీ  నాయకులు రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి ప్లాన్ ప్రకారం లేని భూమికి పట్టాలు వచ్చేటట్లు చేసినట్లు తెలుస్తోంది. జజ్జర్వెల్లిలో మూడు గంటల  బిలా దాఖలా పోరంబోకు భూమి ఉంది. ఈ భూమిని చూపిస్తూ రెవెన్యూ ఆఫీసర్లు  సర్వే నెంబర్ ఒకటికీ బై నెంబర్లను తగిలించి ఇలా 52 మందికి పట్టా పాసుబుక్కులు కూడా మంజూరు చేశారు. వీటన్నింటిని లావుని పట్టాల కింద రికార్డుల్లో  ఎక్కించారు.

 ఇలా రెండు సంవత్సరాల నుంచి రైతుబంధు, క్రాప్ లోన్ లు తీసుకుంటున్నారు. ఇన్ని రోజుల నుంచి జరుగుతున్న  కనీసం వ్యవసాయ అధికారులు కానీ, ఇతర  ఏ అధికారులు కానీ ఇప్పటివరకు వాటిని పట్టించుకోలేదు. పలుకుబడి కలిగిన నాయకుడు కాబట్టి  అధికారులు పట్టించుకోలేదా అనే అనుమానాలు కూడా వస్తున్నాయి. ఏది ఏమైనా కొంతమంది   రెవెన్యూ అధికారులు మాత్రం ఏదైనా పేదవాడికి భూ సమస్య వస్తే వంద రకాల కారణాలు చెప్పి  వారిని ఇబ్బంది పెడతారు. ఇలాంటి దొంగ పనులు మాత్రంచాలా తొందరగా చేసి పెడతారని  ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: