ఒకప్పుడు ఏదైనా ఆర్థిక అవసరం ఏర్పడింది అంటే చాలు పొరుగింటి వారి దగ్గరనో పక్కింటి వారి దగ్గరనో డబ్బులు తీసుకునే వారు. కానీ నేటి రోజుల్లో టెక్నాలజీ పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఏదైనా అవసరం పడింది అంటే చాలు ఎవరి దగ్గర అడగాల్సిన పనిలేదు. బ్యాంకులు అడగకుండానే అప్పులు ఇస్తున్నాయి. అది కూడా వేలల్లో కాదు ఏకంగా లక్షల్లో బ్యాంకులు వద్దన్న అప్పులు ఇస్తున్నాయి అన్న విషయం తెలిసిందే. ఇలా టెక్నాలజీ ఎంతగానో పెరిగిపోయింది. అయితే ఇలాంటి సమయంలోనే అటు సైబర్ నేరాలు కూడా భారీగా పెరిగిపోవడం అందరిని ఆందోళన కలిగిస్తోంది.


 దీంతో ఏం చేయాలన్న కూడా భయపడే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఓ మహిళా కానిస్టేబుల్ కు చేదు అనుభవం ఎదురైంది. ఆ మహిళకు డబ్బు అవసరమైంది దీంతో రుణం కోసం బ్యాంకుకు వెళ్ళింది మహిళా కానిస్టేబుల్. కానీ ఇక బ్యాంకు అధికారులు చెప్పిన నిజం విని ఒక్కసారిగా షాక్కు గురైంది. ఆల్రెడీ కానిస్టేబుల్  పేరుపై ఇతర రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి లోన్ తీసుకున్న విషయాన్ని బ్యాంకు అధికారులు చెప్పారూ. దీంతో చేసేదేమీలేక సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది ఆ మహిళా కానిస్టేబుల్. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


 హైదరాబాదులో సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది మహిళా కానిస్టేబుల్. ఇటీవలే  లోన్ తీసుకోవడానికి ఎస్బిఐ బ్యాంకు కి వెళ్ళింది. కానిస్టేబుల్ వివరాలు చెక్ చేసిన బ్యాంకు అధికారులు ఆల్రెడీ మీ పేరు పైన 80 వేల రూపాయల రుణం తీసుకున్నట్లుగా ఉంది అంటూ షాక్ ఇచ్చారు. తన ప్రమేయం లేకుండా తన పేరుపై ఎవరు లోన్ తీసుకున్నారు  అంటూ డీటెయిల్స్ అడిగింది మహిళా కానిస్టేబుల్. దీంతో ఆరా తీయగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి సదరు మహిళా కానిస్టేబుల్ పాన్ కార్డు పై లోన్ తీసుకున్నట్లు తెలిసింది. దీంతో షాక్ అయిన లేడీ కానిస్టేబుల్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: