ఎంతోమంది బలవంతంగా ప్రాణాలు తీసుకుంటూ ఉండటం తో ఎన్నో కుటుంబాల్లో విషాదం నిండి పోతుంది. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది.. ఇటీవలే ఓ మహిళ తీసుకున్న నిర్ణయం అభం శుభం తెలియని ఓ చిన్నారికి తల్లిని దూరం చేసింది. చిన్న కారణానికి మనస్థాపం చెందిన మహిళ బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన పెద్దపల్లి జిల్లా గోదావరిఖని రొంపికుంట కు చెందిన గుమ్మడి ఉమకు 2009లో వివాహం జరిగింది. వీరికి దాదాపు పదేళ్ల వరకు పిల్లలు కాలేదు.. ఇటీవలే ఉమా గర్భం దాల్చడంతో ఎంతో ఆనంద పడిపోయింది.
ఈ క్రమంలోనే ఈ నెల 11వ తేదీన ఆసుపత్రిలో చేరగా 12వ తేదీన పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది ఉమా. దీంతో భార్యాభర్తలు ఎంతో సంతోష పడిపోయారు. పెళ్లయిన పదేళ్ల తర్వాత దేవుడు అనుగ్రహించాడు అంటూ ఆనందపడ్డారు. అయితే ఆపరేషన్ కావడంతో ఉమా కు కుట్లు పడ్డాయి.. అయితే కుట్లు మానిపోకుండా డెలివరీ అయిన నాటి నుంచి తీవ్రంగా ఇబ్బంది పెడుతూ వచ్చాయి. అదే సమయంలో వివిధ ఆరోగ్య సమస్యలు కూడా రావడంతో ఉమా ఎంతగానో మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే ఆస్పత్రిలోని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తల్లి క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయంతో ముక్కుపచ్చలారని చిన్నారి తల్లి ప్రేమకు దూరం అయింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి