సాధారణం గా సినిమాలను చూసి ఎంతో మంది స్ఫూర్తి పొందుతూనే ఉంటారు అన్న విషయం తెలిసిందే. కొంతమంది సినిమా లో ఉండే మంచినీ గ్రహిస్తే మరికొంతమంది సినిమాల లో ఉండే చెడు విషయాలకు ఆకర్షితులు అవుతున్నారు. ఇటీవల సుకుమార్ దర్శకత్వం లో అల్లు అర్జున్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ గంధపు చెక్కల స్మగ్లింగ్ కోసం వేసిన ప్లాన్స్ అన్నింటినీ కూడా ఎంతోమంది స్ఫూర్తి పొంది నిజ జీవితం లో కూడా ఆచరణ లో పెట్టారు.


 ఇలా పుష్ప స్టైల్ ఎంతో మంది స్మగ్లర్లు అక్రమాలకు పాల్పడుతున్న నేపథ్యం లో పోలీసులు కూడా వారికి షాకిచ్చారు. ఇక ఇప్పుడు కొంత మంది దొంగలు ధూమ్ సినిమాను చూసి బాగా స్ఫూర్తి పొందారు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ధూమ్ సినిమా లో  దొంగతనాలు చేయడం పోలీసుల నుంచి తప్పించుకోవడం చేస్తూ ఉంటారు. ఇప్పటి వరకు సీక్వల్ మూడు సినిమాలు వస్తే 3 కూడా సూపర్హిట్ సాధించాయ్ అని చెప్పాలి. సినిమా లో నుంచి ఎంతగానో స్ఫూర్తి పొందిన దొంగలు దొంగతనం చేసేసారు.



 పాఠశాల లో కంప్యూటర్లు ఎత్తుకెళ్లిన దొంగలు అక్కడ ఉన్న బోర్డుపై ధూమ్ 4 కమింగ్ సూన్ అంటూ రాసి వెళ్లారు. దమ్ముంటే మమ్మల్ని పట్టించుకోండి అంటూ సవాల్ కూడా విసిరారు. ఒడిశా లోని నవరంగ పూర్ జిల్లా ఖాతి గూడా లో కూడా ఉన్నత పాఠశాల లో ఈ ఘటన వెలుగు లోకి వచ్చింది. హెడ్మాస్టర్ రూము తలుపులు పగులగొట్టి ఏకంగా కంప్యూటర్ల తో పాటు సౌండ్ బాక్స్ కూడా ఎత్తుకెళ్లి నట్లు తెలుస్తోంది. ఈ ఘటనను ఎంతో సవాల్గా తీసుకున్నారు పోలీసులు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికం గా సంచలనం గా మారి పోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: