
దీంతో నేటి రోజుల్లో కష్టసుఖాల్లో తోడు ఉండడం కాదు.. చిన్న చిన్న కారణాలతోనే కట్టుకున్న వారిని దారుణంగా హతమారుస్తున్న వారే కనిపిస్తున్నారు అని చెప్పాలి. ఇలాంటివి చూసిన తర్వాత భార్యాభర్తల బంధం అంటే ఇంత దారుణంగా ఉంటుందా? ఒకసారి పెళ్లి బంధంలోకి అడుగు పెట్టిన తర్వాత నరకం అనుభవించాల్సిదేనా అనే భావన యువతి యువకుల్లో కలుగుతుంది అని చెప్పాలి. ఇలాంటి రోజుల్లో కూడా భార్యాభర్తల మధ్య అన్యోన్యతను ప్రేమానురాగాలను తెలియజేసే ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి.
ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే. ఆ ఇద్దరు భార్యాభర్తలు ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతికారు. కానీ వారి సంతోషాన్ని చూసి విధి కన్ను కూట్టింది. దీంతో భార్యను మృత్యు ఒడిలోకి చేర్చింది. అయితే భార్య మృతిని తట్టుకోలేకపోయిన భర్త చివరికి లారీ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లాలో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్షెట్టిపేట మండలం ఎల్లారం గ్రామానికి చెందిన శరణ్య పక్కింటి వాళ్ళతో గొడవ వల్ల మనస్థాపానికి గురై పురుగుల మందు తాగింది. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది శరణ్య.భార్య లేని జీవితాన్ని ఊహించుకోలేకపోయినా భర్త మల్లికార్జున్ మృతదేహాన్ని తీసుకు వెళుతున్న సమయంలో లారీ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. కాగా తల్లిదండ్రులు మృతితో ఇద్దరు పిల్లలు అనాధలుగా మారారు.