
అయితే చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత ఆయన తరఫున వ్యక్తులు మాట్లాడుతూ.. ఒప్పందం సమయంలో 130 కోట్లు స్కిల్ డెవలప్ మెంట్ విషయంలో సామాన్లు కొనేందుకు ఉపయోగించామని మిగతా డబ్బులు రూటింగ్ జరుగున్నట్లు చెప్పారు. ఈ విషయంలో ఈడీ కూడా సైలెంట్ గానే ఉంది. అయితే సీబీఐ మాత్రం ఎలా జరిగింది. ఎప్పుడు జరిగింది. ఎయే కంపెనీలకు డబ్బులను అక్రమంగా తరలించారనే వివరాలను సేకరించి చంద్రబాబును అరెస్టు చేసింది.
అయితే చంద్రబాబు అరెస్టు తర్వాత ఈ కేసులో ప్రముఖ పాత్ర పోషించిన చంద్రబాబు పీఏ శ్రీనివాస రావును ప్రశ్నించాలని సీబీఐ చూస్తుంది. కానీ శ్రీనివాస్ మాత్రం చెప్ప పెట్టకుండా విదేశాలకు పారిపోయారు. ప్రధాన సూత్రదారుడుగా ఉన్న శ్రీనివాస్ విదేశాలకు వెళ్లడం వల్ల సీబీఐ ఈ కేసును మరింత ముందుకు తీసుకెళ్లకుండా పోతోంది. అయితే ఇదే విషయం చంద్రబాబు బెయిల్ కు అడ్డంకిగా మారుతోంది.
చంద్రబాబును విడుదల చేస్తే ఆయన తన పీఏ శ్రీనివాస్ ను కానీ ఇతరులను ఇన్ఫూయేన్స్ చేస్తారనే సీబీఐ కోర్టులో వాదనలు వినిపిస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఇలాంటి వాదనలే వినిపించారు. ప్రస్తుతం లోకేశ్ పై కూడా ఇన్నర్ రింగ్ రోడ్డు వివాదంలో కేసు నమోదు చేసిన సీబీఐ ఆయనకు నోటీసు ఇచ్చింది. ఈ విషయంలో లోకేశ్ ప్రధాన అనుచరుడు కిలారు రాజేశ్ కూడా విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అటు శ్రీనివాస్, ఇటు కిలారు రాజేశ్ వస్తే అసలు విషయం బయటపడే అవకాశం ఉంది.