
అక్టోబర్ 7 న ఇజ్రాయిల్ లో జరిగిన దాడుల తర్వాత లెబనాన్ నుంచి కూడా హిజ్బుల్లా గ్రూపు కూడా తీవ్రమైన దాడులకు తెగబడింది. దీంతో ఇజ్రాయిల్ ప్రభుత్వం లెబనాన్ పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. లెబనాన్ లోని బీరుట్ అంతర్జాతీయ విమానాశ్రయం పై ఇజ్రాయిల్ దాడులు చేయడంతో అక్కడి నుంచి రాకపోకలు నిలిచిపోయాయి. పాడి పరిశ్రమలు కూడా పూర్తిగా దెబ్బతింది. అటవీ ప్రాంతాలు కూడా దెబ్బతిన్నాయి. దీంతో పాటు పొగాకు పంట కూడా తీవ్రంగా దెబ్బతిన్నట్లు లెబనాన్ రైతులు అంటున్నారు.
అయితే తమకు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది కేవలం హమాస్ తోనే అని ఇజ్రాయిల్ చెబుతోంది. హిజ్జుల్లా గ్రూపుతో కాదని ఇజ్రాయిల్ తెగేసి చెబుతోంది. హమాస్ ఉగ్రవాదులు బందీలుగా తీసుకెళ్లిన వారిని విడిపించేందుకు నాలుగు రోజులు కాల్పుల విమరణకు ఇజ్రాయిల్ అంగీకరం తెలిపింది. ఇందులో భాగంగా మొదటి రోజు 25 మంది ఇజ్రాయిల్ బందీలను హమాస్ విడిచిపెట్టగా దాదాపు 150 మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయిల్ విడుదల చేసింది.
దీంతో నెల రోజుల పైగా బాంబు దాడులతో దద్దరిల్లిన గాజా ప్రాంతం రెండు రోజులుగా ప్రశాంతంగా ఉంది. మొత్తం 150 మంది ఖైదీలను విడతల వారీగా విడుదల చేస్తామని హమాస్ ఒప్పుకుంది. దీనికి ఖతర్, ఈజిప్టు, అమెరికా మధ్య వర్తిత్వం వహించాయి. అయితే బందీల విడుదల వరకే కాల్పుల విరమణ ఉంటుందని హమాస్ ను పూర్తిగా అంతం చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజిమెన్ నెతన్యాహు ప్రకటించారు.