నరేంద్ర మోడీ.. దేశంలో తిరుగులేని నాయకుడు. నెహ్రూ తర్వాత.. సొంత బలంతో రెండోసారి దేశానికి ప్రధానిగా ఎన్నికైన ప్రజాకర్షణ గల నేత. ఆ స్థాయిలో మరో నాయకుడెవరూ జాతీయ స్థాయిలో కనిపించడం లేదు. అలాంటి మోడీ చరిష్మాకు కరోనా పెద్ద దెబ్బ కొట్టింది. కరోనా కట్టడిలో మోడీ ఘోరంగా విఫలం అయ్యారన్న వాదన బాగా వినిపిస్తోంది. ప్రధాని మోడీ తీరుపై ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తున్నాయి.

నిన్న మొన్నటి వరకూ మోడీని ఆకాశానికెత్తేసిన అంతర్జాతీయ మీడియా కూడా ఇప్పుడు ఘోరంగా విమర్శిస్తోంది. న్యూయార్క్ టైమ్స్‌ వంటి విదేశీ పత్రికల్లోనూ మోడీ వైఫల్యంపై కథనాలు విరివిగా వస్తున్నాయి. అందుకే ఇప్పుడు బీజేపీ నాయకత్వం కూడా ప్రధాని మోడీ వైఫల్యాలపై దృష్టి సారించిందట. మోడీ ఫెయిల్యూర్‌పై ఇదే తరహాలో ప్రజల్లో అసంతృప్తి పెరిగితే.. అది వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయావకాశాలను ఘోరంగా దెబ్బ తీస్తుందని బీజేపీ మాతృసంస్థ ఆర్ఎస్‌ఎస్‌ కూడా భావిస్తోందట.

అందుకే ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ మార్గాలవైపు దృష్టి సారిస్తోందన్న టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీలో ఇప్పుడు మోడీకి దీటుగా నాయకత్వం వహించగల నాయకుడి అన్వేషణ మొదలైందట. అందులో మంత్రి గడ్కరీ పేరు ప్రముఖంగా వినిపిస్తోందట. ఎందుకంటే.. పార్టీలో ఎక్కువ మందికి ఆమోద యోగ్యుడైన నాయకుడిగా గడ్కరీ పేరు ప్రాచుర్యంలోకి వస్తోందట.

మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కమలదళం జాగ్రత్తపడుతోందట. అయితే మరి  మోడీ పరిస్థితి ఏంటి అంటే.. ఆయన్ను రాష్ట్రపతిగా కొందరు ప్రతిపాదిస్తున్నారట. అయితే ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే. ఎన్నికలకు రెండేళ్లు ఉన్నందువల్ల మోడీ.. ఈలోపు తన చరిష్మా పెంచుకునే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. ఏదైమైనా కరోనా మాత్రం మోడీ చరిష్మాను బాగా దెబ్బకొట్టిందన్న మాట వాస్తవం. ఈ విషయం మోడీ టీమ్‌కు కూడా బాగానే తెలుసు. మరి ఇందుకు విరుగుడు ఏం రాజకీయ వ్యూహాలు రచిస్తారన్నది ఇప్పుడు వేచి చూడాలి.

  


 

మరింత సమాచారం తెలుసుకోండి: