ఓటమి అంచున ఉన్న ఉక్రెయిన్  తన పరువు తీస్తుందని బాధపడుతున్నాడట ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. ఉక్రెయిన్ ఓడిపోతే తాను ఓడిపోయినట్టుగా ఫీల్ అవుతున్నాడట అమెరికా అధ్యక్షుడు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా వెళ్లడం అనేది ప్రపంచం ముందు దాని పరువు పోయినట్టుగా అయిపోయింది. దాని ఆధిపత్యం పడిపోయినట్లుగా అయిపోయిందని తెలుస్తుంది. సౌదీ అరేబియా లాంటి వాళ్ళు అమెరికాను లెక్కచేయట్లేదు అంటే అవమానించి పంపిస్తున్నారు అంటే దానికి కారణం ఇదే అని తెలుస్తుంది.


ఇంతకుముందు భయంగా ఉండే దేశాలు ఇప్పుడు లెక్కచేయడం లేదంటే కారణం ఇదే అని తెలుస్తుంది. అలాగని ఉక్రెయిన్ ని గెలిపించాలని అనుకుంటే  జరగని పని. అలాగని అమెరికా  పాల్గొంటే అది అణు యుద్ధమే అవుతుంది. అసలు ఉక్రెయిన్ సైన్యం శక్తి ఏమైపోతుంది ఎక్కడుంది అసలు వాళ్ళ ఆలోచన అని జో బైడెన్ తనకు సంబంధించిన కొంత మంది సన్నిహిత వర్గాలతో అంటున్నట్లుగా వినిపిస్తుంది.


పోర్టికో ప్రకారం, ఉక్రెయిన్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న దాడిలో విఫలమైతే పరిస్థితి ఏంటి అనే విషయం పైన, దాని తర్వాత వచ్చే ఫలితం ఏమిటా అని బైడెన్ ప్రభుత్వం చాలా ఆత్రుతతో యుద్ధం తర్వాత వచ్చే ఫలితాల కోసం సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తుంది.  టీమ్ బైడెన్ స్వదేశంలోనూ ఇంకా విదేశాల్లో ఉన్న కూటమి విమర్శకులను ఎదుర్కోవడం గురించి ఆందోళన చెందుతోంది. కైవ్ రష్యా దళాల నుండి కోల్పోయిన భూభాగాలను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం లేదు.  కొంతమంది అధికారులు ఉక్రెయిన్ యుద్ధభూమిలో పరిమిత విజయాన్ని సాధిస్తుందని అంటున్నారట.


ప్రస్తుతం రేపు చలికాలం వచ్చే సమయానికి ఉక్రెయిన్ మొత్తం రష్యా హస్తగతం అయ్యే ప్రమాదం ఉంది. అదే గనుక జరిగితే ఇంటా బయట కూడా చులకన అయిపోతామని బైడెన్ బాధ అని తెలుస్తుంది.  ఉక్రెయిన్ గెలుస్తుందా లేదా అని బైడెన్ పరిశీలిస్తే కొంత కష్టంగా కాదు, అతి కష్టం మీద గెలుస్తుంది ఏమో అని అన్నారట నిపుణులు.

మరింత సమాచారం తెలుసుకోండి: