అవును జాతీయ మీడియా అని చెప్పుకునే కొన్ని ఛానళ్ళు వ్యవహరిస్తున్న విధానాలతో చాలామందికి ఇపుడిదే అనుమానం వస్తోంది. జాతి మీడియా అంటే ఎవరి ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై బురద చల్లుతోందో అందరికీ తెలిసిందే. మరి జాతీయ మీడియాకు ఏమైంది ? నాలుగు రోజుల క్రితం టిటిడి ట్రస్టుబోర్డు ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి పైన కూడా జాతీయ మీడియాలో తప్పుడు కథనాలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.  జాతీయ మీడియాలో రిపీటెడ్ గా ప్రభుత్వంపై ఉద్దేశ్య పూర్వకంగా వ్యతరేకంగా కథనాలు వస్తున్నాయి కాబట్టే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

ఇప్పుడిదంతా ఎందుకంటే టైమ్స్ నౌ ఛానల్లో విశాఖపట్నం గ్యాస్ ప్రమాదంపై చర్చ జరిగింది. గురువారం తెల్లవారుజామున గ్యాస్ ప్రమాదం జరిగితే అదే రోజు రాత్రి 9.30 గంటలకు డిబేట్ జరిగింది. డిబేట్ లో యాంకర్ నావికా కుమార్ తో ప్రభుత్వ సలహాదారు దేవులపల్లి అమర్ పాల్గొన్నాడు. నావికా మాట్లాడుతూ ప్రమాధ ఘటనపై ప్రభుత్వం నియమించిన హై పవర్ కమిటి నివేదిక ఎప్పటికి వస్తుంది ? అని ప్రశ్నించింది.

 

అమర్ సమాధానమిస్తు ఆ విషయాన్ని తాను చెప్పలేనని, కమిటితో విచారణ  చేయిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రకటన చేసింది ఇప్పుడే కాబట్టి ఆ విషయమై తాను ఏమీ చెప్పలేనని చెప్పాడు. అమర్ చెప్పిన సమాధానంలో తప్పేమీ లేదు. ఎందుకంటే జగన్ చేసిన ప్రకటన ఆచరణలోకి రావాలంటే జీవో జారీ అవ్వాలి. కమిటి విచారణ మొదలుపెట్టాలి. విచారణంటే చాలామందిని కలవాల్సుంటుంది. తర్వాత కమిటి సభ్యులు చర్చించుకోవాలి. ఆ తర్వాతే నివేదికను తయారు చేసి ప్రభుత్వానికి ఇస్తుంది.

ఛానల్ లో చర్చ జరిగే సమయానికి ఇంకా జీవోనే రిలీజ్ కాలేదు. కమిటిలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారో కూడా పూర్తిగా తెలీదు. నివేదిక ఇవ్వటానికి ప్రభుత్వం ఏమన్నా గడువు విధిస్తుందో లేదో కూడా ఎవరికీ తెలీదు.  ఏమీ తెలీకుండానే యాంకర్ ప్రశ్నకు అమరే కాదు ఎవ్వరూ  సమాధానం చెప్పలేరు.  జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం హై పవర్ కమిటిని నియమిస్తు ఉత్తర్వులిచ్చింది శుక్రవారం మధ్యాహ్నం. అలాంటిది సమాధానం చెప్పలేని ప్రశ్నను యాంకర్ అడగటమే తప్పు.  ఒకవేళ ప్రశ్న అడిగినా అమర్ సమాధానం చెప్పిన తర్వాత ఇక ఆ ప్రశ్నను వదిలేయాలి.

 

కానీ యాంకర్ మాత్రం అదే ప్రశ్నను తిప్పి తిప్పి అడగటంలో అర్ధమేంటి ?  పైగా తానడిగిన ప్రశ్నకు ప్రభుత్వ సలహదారుడిగా ఉండి కూడా సమాధానం చెప్పలేకపోవటం ఏమిటంటూ అమర్ ను నిలదీసింది. అమర్ ప్రభుత్వానికి సలహదారన్న మాట వాస్తవమే కానీ అన్నీ విషయాల మీద కాదన్న విషయం గుర్తుంచుకోవాలి. అంతర్రాష్ట్ర సంబంధాల విషయంలో మాత్రమే అమర్ సలహాదారు. ఇతరత్రా విషయాల్లో అమర్ సలహాదారు కాదు. పైగా జరిగిన ప్రమాధానికి అమర్ కు అసలు సంబంధమే లేదు.

 

ఒకవేళ యాంకర్ నివేదిక ఎప్పటిలోగా వస్తుందో తెలుసుకోవాలని అనుకుంటే ఆ ప్రశ్న వేయాల్సింది చీఫ్ సెక్రటరీనో లేకపోతే మరో ఉన్నతస్ధాయి అధికారినే కానీ అమర్ ను కాదు. ఇంతచిన్న విషయం కూడా తెలీకుండానే యాంకర్ మాత్రం అమర్ ను నోటికొచ్చినట్లు మాట్లాడింది. పైగా ఇటువంటి సలహాదారులను పెట్టుకున్నందుకు ఏపి ప్రభుత్వాన్ని, ప్రజలను దేవుడే కాపాడాలంటూ అనుచితమైన వ్యాఖ్యలు చేయటం మరీ విచిత్రంగా ఉంది.

 

ఈ మొత్తానికి కొసమెరుపేమిటంటే ఛానల్లో జరిగిన డిబేట్ ను తెలుగుదేశంపార్టీ ట్విట్టర్ ఖాతా ద్వారా  ప్రభుత్వానికి వ్యతిరేకంగా   ప్రమోట్  చేయటం. అందుకనే టిడిపి తరపున జాతీయ మీడియా కూడా జగన్ కు వ్యతరేకంగా కుట్ర చేస్తోందన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: