పంచాయితీ ఎన్నికల్లో వీలైనంతగా ఏకగ్రీవాలు జరపాలన్నది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. అయితే ఎలాగైనా అందరితో నామినేషన్లు వేయించి ఎన్నికలు జరపాలనేది స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పట్టుదల. అయితే చివరకు నిమ్మగడ్డే చేతులెత్తేశారు. పంచాయితీలకు గతంతో పోల్చుకుంటే ఇపుడు ఎక్కువ నామినేషన్లే దాఖలయ్యాయి. అయితే 3245 పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సుండగా 525 పంచాయితీలు ఏకగ్రవమయ్యాయి. అలాగే 35,502 వార్డు మెంబర్లకు గాను 12, 185 వార్డుల్లో ఏకగ్రీవాలయ్యాయి. వీటిల్లో చిత్తూరు జిల్లాలో 110 పంచాయితీలు, గుంటూరు జిల్లాలో 67 పంచాయితీలు ఏకగ్రీవాలవ్వటంపై నిమ్మగడ్డకు మండిపోయింది.




దాంతో చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో ఎక్కువ పంచాయితీలు ఏకగ్రీవాలవ్వటంపై అనుమానాలున్నాయన్నారు. అందుకనే వాటి ఫలితాలను నిలిపేయాలన్నారు. పూర్తిస్ధాయిలో విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా రెండు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. దాదాపు నాలుగు రోజుల పాటు ఫలితాలను నిలిపివేయించారు నిమ్మగడ్డ. చివరకు ఏమైంది ? ఏమైందంటే అన్నీ ఏకగ్రీవాలకు నిమ్మగడ్డ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఎలాటంటే నిమ్మగడ్డ ఆదేశాల కారణంగా విచారణ జరిపిన కలెక్టర్లు ఏకగ్రీవాల విషయంలో ఎటువంటి అవకతవకలు జరగలేదని, అధికార దుర్వినియోగం జరగలేదని నివేదిక ఇచ్చారు. మరి కలెక్టర్లే నివేదికలు ఇచ్చిన తర్వాత నిమ్మగడ్డ చేసేదేముంటుంది ? అందుకనే చేసేది లేక కలెక్టర్లిచ్చిన నివేదిక ప్రకారం అన్నీ ఏకగ్రీవాలకు ఓకే చెప్పేశారు.




ఇక్కడ గమనించాల్సిందేమంటే నిమ్మగడ్డ మార్చి 31వ తేదీన రిటైర్ అయిపోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మరో మూడేళ్ళుంటుంది. అలాంటిది నిమ్మగడ్డ చెప్పినట్లు నడుచుకుని మూడేళ్ళు సీఎంగా ఉండే జగన్ తో గొడవలు పెట్టుకుంటారా ఎవరైనా ? పైగా తనకు ఎలాంటి సంబంధం లేకపోయినా ఎన్నికల్లో పోటీ చేయాల్సిందే అంటు నిమ్మగడ్డ విపరీతమైన ఓవర్ యాక్షన్ చేశారంటు వైసీపీ నేతలు మొదటినుండి ఆరోపిస్తునే ఉన్నారు. ఎన్నికలు జరపటం మాత్రమే కమీషనర్ విధి. అంతేకానీ ఏకగ్రీవాలయ్యాయా ? లేకపోతే నామినేషన్లు వేసి పోటీ చేస్తారా అన్నది గ్రామాల్లోని జనాలు తేల్చుకుంటారు. మామూలుగా స్ధానిక ఎన్నికలంటే అధికారపార్టీకే మద్దతు ఎక్కువగా ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. మరి ఇంతచిన్న విషయం అర్ధం చేసుకోకుండా ఎన్నికలకు నిమ్మగడ్డ పట్టుబట్టి ఏమీ సాధించారు ?

మరింత సమాచారం తెలుసుకోండి: