వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ఈయన పేరుకే వైసీపీ ఎంపీ.. సొంత పార్టీపై ఆయన తిరుగుబాటు చేసి చాలా కాలమైంది. రోజూ విపక్షాలు ప్రెస్ మీట్లు పెట్టినా పెట్టకపోయినా.. ఈయన మాత్రం రోజూ ప్రెస్ మీట్‌ పెట్టి జగన్ సర్కారుపై విమర్శలు చేస్తూనే ఉంటారు. ఆయన తాజాగా మద్యం నిషేధం పథకంపై సెటైర్లు వేశారు. ఈ పథకానికి జగనన్న వితంతు పథకం అంటూ  నామకరణం చేస్తూ సెటైర్ వేశారు.


ఇటీవల ఏపీలో సరఫరా చేస్తున్న మద్యంలో విష పదార్థాలు ఉంటున్నాయని టీడీపీ ఆరోపించింది. దీనికి ఏవో కొన్ని టెస్టులు చేయించామని ఆధారాలు చూపింది. అయితే అదంతా కట్టుకథ అంటూ రొటీన్ గానే జగన్ సొంత పత్రిక ఓ కథనం రాసుకొచ్చింది. దీనిపై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఇప్పుడు స్పందిస్తున్నారు. మద్యం శాంపిల్ లో ఏముంది అనేది మాత్రమే సాక్షి పేపర్ లో రాశారని.. అసలు మద్యంలో ఏం కలుస్తుందో దాని వలన ఏమవుతుందో కూడా రాయాలని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సూచించారు.


రాష్ట్రంలో తయారు అయ్యే మద్యంలో హానికరమైన రసాయనాలు ఉన్నాయన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. మద్యం ఎవరు తయారు చేస్తున్నారో చెప్పమంటే ఎందుకు చెప్పరని ప్రశ్నించారు. ఏపీలో ఉన్న బ్రాండ్స్ ఇతర రాష్టాలలో ఎక్కడా లేవన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. పాత బ్రాండ్స్ ఇప్పుడు ఒక్కటి కూడా దొరకడం లేదని.. కొత్త కొత్త బ్రాండ్స్ మార్కెట్ లోకి తెచ్చారని ప్రశ్నించారు. జగనన్న విద్య దీవెన, జగనన్న వసతి దీవెన లాగా... జగనన్న వితంతు దీవెన అని పేరు పెట్టాల్సి ఉంటుందని సెటైర్ వేశారు.


మద్యంలో అవినీతి ఎక్కడ జరుగుతుందో చెప్తానన్న వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. మద్యాన్ని ఇంతకు ముందు బేవరేజేస్  కార్పొరేషన్ తయారు చేసేదని.. కానీ ఇప్పుడు 20 మద్యం కంపెనీల నుండి బ్రాండ్స్ కొంటున్నారని.. దొంగ స్కీమ్స్ పెట్టి దొంగ నాటకాలు ఆడుతున్నారని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. మద్యానికి క్యాష్ ఎందుకు తీసుకుంటున్నారో చెప్పాలని.. క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్స్ ఎందుకు తీసుకోవడం లేదని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: