ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో ఉక్రెయిన్ కు వివిధ దేశాలు అధిక సంఖ్యలో ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. దీనిపై ప్రస్తుతం వివాదం చెలరేగుతుంది. ఇందులో ఆయుధాలను ఉక్రెయిన్ అధ్యక్షుడు అమ్ముకుంటున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. అమెరికా ఇచ్చిన సాయానికి లెక్కలు చెప్పడం లేదని అమెరికా పార్లమెంట్ లో చర్చ జరిగింది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ అధ్యక్షుడు లెక్కలు చెప్పాలని ఓ కమిటీని ఉక్రెయిన్ కు పంపాలని అమెరికా నిర్ణయించింది. ముందుగా ఓకే అన్న జెలెన్ స్కీ తర్వాత వారు రాకుండా అడ్డుకుంటున్నారు. ఆడిట్ కు ముందు సై అన్న జెలెన్ స్కీ తర్వాత తెర వెనక మంతనాలు చేశారన్నది ప్రధాన ఆరోపణ.


అధ్యక్షుడే ఆయుధాలను తీవ్రవాదులకు అమ్ముకుంటున్నాడన్న ఆరోపణల నేపథ్యంలో ఉక్రెయిన్ లోని మరికొంత మంది అధికారులు విచ్చలవిడిగా అవినీతి చేసేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు దోచేసుకుంటున్నారు. దీనికి సంబంధించి కీవ్ నగర్ మేయర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. జెలెన్ స్కీ ప్రస్తుతం ఒక అధికారిని సస్పెండ్ చేశారు. యుద్ధం వల్ల కరెంట్ సమస్యలు, విద్యుత్ ట్రాన్స్ పార్మర్ల సమస్యలు నెలకొన్నాయి.


వీటిని పునర్ నిర్మించడానికి అమెరికా పెద్ద ఎత్తులో ఆర్థిక సాయం చేస్తోంది. కీవ్ ప్రాంతంలో 100 కు పైగా కరెంట్ ట్రాన్స్ పార్మర్లను నెలకొల్పామని చెప్పారు. తీరా కీవ్ మేయర్ ఆ ప్రాంతానికి వెళితే అక్కడ 3,4 కంటే ఎక్కువ లేవు. దీంతో జెలెన్ స్కీ ఆగ్రహం వ్యక్తం చేయడం, దీనిపై ప్రతిగా కీవ్ మేయర్ స్పందించడం జరిగింది. ఇప్పుడు మేయర్ కు సంబంధించిన అధికారి ఒకరు డబ్బులు తీసుకుని, అనంతరం వాటి పనులు చేయకపోవడంతో జెలెన్ స్కీ ఆ అధికారిని సస్పెండ్ చేశారు. ఇప్పటికే యుద్ధంతో తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్ కు అమెరికా, యూరప్ దేశాలు చేస్తున్న సాయం, దాని వెనక జరుగుతున్న అవినీతిపై నే ఇప్పుడంతా చర్చ జరుగుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: