
అలాంటి భారతదేశం మీదకి దండయాత్ర చేయడమే కాకుండా వ్యాపారం చేసుకుంటామని దొంగ చాటుగా వచ్చి, రాజుల మధ్య ఉన్న గొడవలను రెచ్చగొట్టి, పెంచి పోషించి, ప్రోత్సహించి నిదానంగా మన దేశాన్ని ఆక్రమించుకొని జండా ఎగరేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే కేవలం వెన్నుపోటు వ్యవహారాలు తప్పించి ఇంకేమీ తెలియదు వాళ్ళకి అని. అందుకే మన యూనివర్సిటీలోని విజ్ఞాన భాండాగారాలను తగలబెట్టి, విద్యను దూరం చేసి మన వాళ్లకు చదువులు అందకుండా చేసి ఇట్లాంటివి చెప్పకూడదంటూ బ్రిటిష్ వాళ్ళ చదువులు మాత్రమే ఇక్కడ మాస్టర్ చెప్పాలని, ఎవరైనా కోర్టుకు వెళితే అక్కడ జడ్జి భారతీయుడైనా తీర్పు మాత్రం బ్రిటిష్ వాళ్ళు అనుకూలంగానే చెప్పించుకునేవారు.
బ్రిటిష్ వాళ్ళకు తొత్తులుగా, వారికి అనుగుణంగా భారత్ కు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చేలా చేసి ఈ దేశ వ్యవస్థను నాశనం చేసి గుమస్తా గిరి చదువులు నేర్పి అవే గొప్పవి అని చెప్పిన బ్రిటిష్ వాళ్ళ బ్రతుకులు ఎండగడుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ జీ భగవత్ వ్యాఖ్య చేశారు . బ్రిటిష్ వారు రాక ముందు భారత్ దేశంలో 70% అక్షరాస్యత ఉండేది. నిరుద్యోగ సమస్యలు ఏమీ లేవు. అదే సమయంలో ఇంగ్లాండ్ లో 17% అక్షరాస్యత ఉండేది. వాళ్ళ విద్యను ఇక్కడ ప్రవేశపెట్టి మన విద్యా విధానాన్ని అక్కడ అమలు చేశారు దాంతో భారత దేశంలో అక్షరాస్యత 17 శాతానికి పడిపోయింది.