జగన్ ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు. ఏపీ చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ప్రాధాన్యం కల్పించి అభ్యర్థులను ఎంపిక చేసిన సీఎం జగన్ తన టీంను ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వేదికగా ఇటీవల విడుదల చేశారు. సామాన్య కార్యకర్తలకు, మహిళలకు, విద్యావంతులకు టికెట్లు ఖరారు చేసి సోషల్ ఇంజినీరింగ్ కే బ్రాండ్ అంబాసిడార్ అని నిరూపించుకున్నారు.


తాజాగా విడుదల చేసిన అభ్యర్థుల జాబితాను పరిశీలిస్తే.. సీఎం జగన్ సోషల్ ఇంజినీరింగ్ కే పెద్ద పీట వేశారని కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 50శాతం సీట్లు కేటాయించారు. మొత్తం 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలను పరిశీలిస్తే వంద సీట్లను వీరికే కేటాయించారు. ఎంపీ సీట్లను పరిశీలిస్తే.. నాలుగు ఎస్సీ, ఒకటి ఎస్టీ, పదకొండు బీసీలకు కేటాయించారు. అసెంబ్లీ విషయానికొస్తే బీసీలకు 48, ఎస్సీలకు 29, ఎస్టీలకు 7, మైనార్టీలకు 7 గురిని పోటీలో ఉంచారు.


మరోవైపు 2024 ఎన్నికల్లో దాదాపు 81 స్థానాల్లో ఎమ్మెల్యేల మార్పు, 18 ఎంపీ సీట్లలో అభ్యర్థులను మార్చుతూ జగన్ తన తెగువ చూపించారు. దాదాపు 99 స్థానాలు అంటే 50శాతం స్థానాల్లో మార్పులు, చేర్పులు చేశారు. దాదాపు 50శాతం సీట్లు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు, మరో 50శాతం సీట్లు మార్పులు చేర్పులు చేయడం అది కూడా సోషల్ ఇంజినీరింగ్ తో చేయడం సాధారణ విషయమేమీ కాదని దీనికి తెగింపు ఉండాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


అయితే దీనికి కౌంటర్ గా  టీడీపీ నేతలు ఇంతమంది నేతలు పోటీకి పనికి రారా అని కౌంటర్లు వేస్తూ ఉంటుంది.  ఇక్కడే వారు ఓ చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. అదేంటంటే.. టీడీపీ విడుదల చేసిన మొదటి జాబితాను పరిశీలిస్తే.. 2019లో పోటీ చేసిన వారిలో 37మందిని మార్చారు. రెండో జాబితా చూసుకుంటే 34మందిలో 21మందిని కొత్తగా పోటీకి దింపారు. అంటే మొత్తం 128 సీట్లలో అభ్యర్థులను ప్రకటిస్తే అందులో 58మందిని మార్చారు. కాబట్టి ఇక్కడ ఎవరూ తక్కువ కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: