సీఎం జగన్ కు వ్యతిరేకంగా.. వైసీపీ ప్రభుత్వంపై ఒక తరహా నెగిటివ్ ప్రచారం కోసం చంద్రబాబు కొన్ని శక్తులను వాడుకున్నారు. వీరంతా కూడా తమ వ్యక్తిగత, ఇతర రాజకీయ అవసరాల రీత్యా కూడా టీడీపీ అధినేత చెప్పినట్లు చేశారు. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ఆయన్ను తిట్టిపోశారు. దీంతో వైసీపీ సర్కారు వీరిపై కేసులు పెట్టి, జైలుకు పంపింది. తద్వారా తమకే మైలేజ్ వచ్చింది.. దీంతో తమ రాజకీయ జీవితానికి తిరుగుండదు అని కొంతమంది భావించారు. తీరా చూస్తే వారికి ఆశాభంగం తప్పలేదు.


ఇలా చేసి తమకు ఉన్న భవిష్యత్తును కోల్పోయిన వారిలో మొదటి పేరు రఘురామకృష్ణంరాజు పేరు చెప్పుకోవచ్చు. రెండో వ్యక్తి మహా సేన రాజేశ్. వీరిద్దరు టికెట్లు వస్తాయని భావించారు. రాజేశ్ కి అయితే ప్రకటించి వెనక్కి తీసుకున్నారు. రఘురామ కృష్ణం రాజుకు అయితే అసలే సీటే ప్రకటించలేదు. వీరిద్దరూ చంద్రబాబు ప్రయోజనం కోసం జగన్ పై పోరాటాలు చేశారు. నెగిటివ్ కామెంట్లు మాట్లాడారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు వారికి టీడీపీ, బీజేపీలు టికెట్ కేటాయించకోపవడం కూడా జగన్ తప్పే అని విచిత్ర వాదన చేస్తున్నారు. తాజాగా రఘురామ కృష్ణం రాజు ప్రతినబూనారు. కాస్కో జగన్ అంటూ సవాల్ విసిరారు. కొద్ది రోజుల్లో పాతాళానికి తొక్కేస్తానంటూ హెచ్చరికలు పంపారు.


నరసాపురం ఎంపీ స్థానాన్ని రఘురామ కృష్ణం రాజుకు కాకుండా.. భూపతి రాజు శ్రీనివాస వర్మకు బీజేపీ అప్పగించింది. తనకు బీజేపీ ఎంపీ టికెట్ దక్కకపోవడానికి జగన్ ప్రధాన కారణం అని ఆయన భావిస్తున్నారు. సోము వీర్రాజు ద్వారా అడ్డుకట్ట వేశారని ఆరోపిస్తున్నారు. మరోవైపు మహాసేన రాజేశ్ ఏమో నన్ను ఎమ్మెల్యే కాకుండా సీఎం జగన్ అడ్డుకున్నారు.. మిమ్మల్ని సీఎం కాకుండా నేను అడ్డుకుంటా అంటూ శపథాలు చేస్తున్నారు. ఈ విషయంలో చంద్రబాబు సూపర్ లక్కీ అని పలువురు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఆయన టికెట్ ఇవ్వకపోయినా.. ఆయన్ను ఒక్కమాట అనరు. ఇంకా ప్రత్యర్థులనే విమర్శిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: