
ఇప్పుడు ఎన్నికలు జరిగిన పది నెలల తర్వాత జగన్ మరో ప్రయోగం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు జగన్ షఫిలింగ్ రాజకీయాలకు తెరదీశారు. అంటే అసలు ఏమాత్రం జిల్లాతో సంబంధం లేని నాయకులను.. అందులోనూ సెకండ్ కేడర్ నాయకులను పొరుగు జిల్లాలకు కేటాయించి ఏకంగా పార్లమెంటు స్థానాల బాధ్యతలు అప్పగించారు. కనీసం వాళ్లు ఏనాడు ఎమ్మెల్యేలు లేదా ఎమ్మెల్సీ లు.. ఎంపీలు గా గెలిచిన వారు కాదు.. వాళ్లకు ఓ గ్రామం లేదా పట్టణాన్ని లీడ్ చేయడమే గగనం. అలాంటిది ఏకంగా పార్లమెంటు స్థాయి పదవులు కట్టబెట్టి కేడర్‌ను సమన్వయం చేయమంటే ఏం చేస్తారు ? ఇప్పుడు ఈ నాయకులు ఆ ఏడు నియోజకవర్గాల్లోని నాయకులను సమన్వయం చేసుకుని పార్టీని నిలబెట్టే బాధ్యతలను భుజాలకెత్తుకోవాలి.
కానీ, ఈ తరహా ప్రయోగాలు సక్సెస్ కావనే చెప్పాలి. విజయవాడలోనే పట్టు లేని, కార్పొరేటర్ స్థాయి నాయకు డు పూనూరు గౌతం రెడ్డిని ఏకంగా.. బలమైన నరసరావుపేట పార్లమెంటు నియోజకవర్గానికి పరిశీలకుడిగా పంపారు. ఆయన మాట విజయవాడలోనే ఎవ్వరూ వినరు. గుంటూరుకు చెందిన మోదుగుల వేణుగోపాల రెడ్డికి బలమైన విజయవాడ పార్లమెంటు స్థానం వైసీపీ పరిశీలకుడిగా వేశారు. అసలు ఐదేళ్లలో మోదుగులను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఆయన యాక్టివ్‌గా లేరు. జంగారెడ్డిగూడెంకు చెందిన ఓ సెకండ్ కేడర్ లీడర్ జెట్టి గురునాథరావుకు బందరు పార్లమెంటు పగ్గాలు అప్పగించారు. ఆయన ఇక్కడే నియోజకవర్గ స్థాయి నాయకుడు కాదు. మార్కాపురం మాజీ ఎమ్మెల్యే, వయసు రీత్యా వృద్ధాప్యంలో ఉన్న జంకే వెంకటరెడ్డిని నిత్యం రాజకీయాలు మారుతున్న నెల్లూరులో కేటాయించడం కామెడీ అనుకోవాలి. ఏదేమైనా ఈ తరహా రాజకీయాలు జగన్ సక్సెస్ చేయలేరనే అంటున్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు