ప్ర‌తిప‌క్షంలో ఉన్న వైసీపీ ప్రాంతాల ప‌రంగా చూసుకుంటే.. ఎంతో ఎక్కువ‌గా క‌ష్ట‌ప‌డితే తప్ప ఫ‌లితం ద‌క్క‌ని జిల్లాలు రెండు క‌నిపిస్తున్నాయి.ఇవి రెండు.. ఉమ్మ‌డి జిల్లాలే కావ‌డం.. పైగా పార్టీ అధినేత జ‌గ‌న్ నివాసానికి అత్యంత చేరువ‌లో ఉన్న జిల్లాలు కావ‌డం గ‌మ‌నార్హం. అవే..ఉమ్మ‌డి కృష్ణా, ఉమ్మ‌డి గుంటూ రు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల్లోనూ ఒక్క సీటంటే ఒక్క సీటును కూడా ద‌క్కించుకోలేక పోయింది. అంతేకాదు.. బల‌మైన ఓటు బ్యాంకు కూడా క‌కావికలం అయిపోయింది.


దీనికితోడు.. నాయ‌కులు కూడా పార్టీని వ‌దిలి వెళ్లిపోయారు. అప్ప‌టి ఎంపీ.. లావు శ్రీకృష్ణ‌దేవ‌రాయులు పా ర్టీ మారి విజ‌యం ద‌క్కించుకున్నారు. అలానే.. అప్ప‌టి ఎంపీ బాల‌శౌరి కూడా ఇదే ప‌నిచేశారు. ఇక‌, ఎమ్మె ల్యేల ప‌రంగా కూడా.. కొంద‌రు జంప్ చేశారు. మ‌రికొంద‌రు సైలెంట్ అయ్యారు. ఇక‌, భ‌విష్య‌త్తు మాటేంటి? అనేది కీల‌కంగా మారింది. ఇలా చూసుకుంటే.. వైసీపీ పాలిటిక్స్‌లో ఈ రెండు జిల్లాల్లోనూ చెమ‌టోడ్చాల్సి న ప‌రిస్థితి అయితే క‌నిపిస్తోంది.



ప్ర‌ధానంగా గుంటూరు, ఉమ్మ‌డి కృష్ణాలోని విజ‌య‌వాడ స‌హా చుట్టుప‌క్కల ఉన్న మైల‌వ‌రం వంటి ప్రాం తాల‌పై రాజ‌ధాని అమ‌రావ‌తి ఎఫెక్ట్ ఎక్కువ‌గా ఉంది. రాజ‌ధాని డెవ‌ల‌ప్ కావాల‌ని ఇక్క‌డివారు కోరుతు న్నారు. గుంటూరులో ఉన్న‌వారు ఎలానూ త‌మ ప్రాంతం రాజ‌ధాని కావాల‌ని అనుకోవ‌డం త‌ప్పుకాదు. కానీ, ఇది డెవ‌ల‌ప్ అయితే.. త‌మ‌కు కూడా మేలు జ‌రుగుతుంద‌ని విజ‌య‌వాడ స‌హా.. ఉమ్మ‌డి కృష్ణావాసు లు చెబుతున్నారు. ఈ ప్ర‌భావ‌మే గ‌తంలో వైసీపీపై ప‌డింది. దీంతో పార్టీ న‌ష్ట‌పోయింది.



ఇది మాత్ర‌మే కాకుండా.. డెవ‌ల‌ప్‌మెంటు స‌హా.. ఇత‌ర అభివృద్ధి ప‌నుల‌కు కూడా ఈ రెండు జిల్లాల వారు కూడా ప్రాధాన్యం ఇస్తారు. అందుకే.. ఇక్క‌డి ప్ర‌జ‌లు వైసీపీకి దూరంగా ఉంటున్నారు. ఇటీవ‌ల నిర్వ‌హిం చిన నిర‌స‌న‌లకు కూడా పెద్ద‌గా ప్ర‌జ‌లు రాక‌పోవ‌డానికి ఇదే కార‌ణం. అందుకే.. ఈ రెండు జిల్లాల్లోనూ వైసీ పీ పుంజుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. అదేస‌మ‌యంలో గ‌త నాయ‌కుల‌ను కూడా మార్చాల్సిన అవ‌స‌రం క‌నిపిస్తోంది. రాష్ట్రంలోని ఇత‌ర ప్రాంతాల ప‌రిస్థితి ఎలా ఉన్నా.. ఈ రెండు చోట్ల వైసీపీ పుంజుకోవాలంటే.. మాత్రం ఖ‌చ్చితంగా చెమ‌టోడ్చాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

మరింత సమాచారం తెలుసుకోండి: