ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల్లోనూ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టుకొచ్చిన క‌రోనా భూతం అటు ప్ర‌జ‌ల‌కు, ఇటు ప్ర‌భుత్వాల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మ‌రోవైపు ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు దేశ ఆర్థిక వ్యస్థ‌ల‌న్నీ చిన్నాభిన్నం అయ్యాయి. అయితే ఇలాంటి స‌మ‌యంలో  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-ఎస్బీఐ భారీగా ఉద్యోగాల భర్తీకి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఎస్‌బీఐ. ఈ నోటిఫికేష‌న్‌లో 431 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల్ని ప్రకటించింది. 

 

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 23న అంటే నేటి నుంచే స్టాట్ అయింది. ఇక‌ దరఖాస్తు చేయడానికి 2020 జూలై 13 చివరి తేదీ. ఖాళీల విష‌యానికి వ‌స్తే.. మొత్తం ఖాళీలు 431 అందులో.. ఎగ్జిక్యూటీవ్ - 241, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (సోషల్ బ్యాంకింగ్ & సీఎస్ఆర్)- 85, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ రిలేషన్స్)- 2, సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (అనలిటిక్స్)- 2సీనియర్ ఎగ్జిక్యూటీవ్ (డిజిటల్ మార్కెటింగ్)- 2, హెడ్ (ప్రొడక్ట్, ఇన్వెస్ట్‌మెంట్, రీసెర్చ్)- 1, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (పోర్ట్‌ఫోలియో అనాలిసిస్ & డేటా అనలిటిక్స్)- 1, సెంట్రల్ రీసెర్చ్ టీమ్ (సపోర్ట్)- 1, ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్- 9, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్,  మేనేజర్ (టెక్నాలజీ)- 1, రిలేషన్‌షిప్ మేనేజర్ (బ్యాక్‌లాగ్)- 48, రిలేషన్‌షిప్ మేనేజర్ (టీమ్ లీడ్)- 3 వంటి పోస్టులు ఉన్నాయి.

 

వీటితో పాటు ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్- 20, ప్రొడక్ట్ మేనేజర్- 6, మేనేజర్ (డేటా అనలిస్ట్)- 2, మేనేజర్ (డిజిటల్ మార్కెటింగ్)- 1, ఫ్యాకల్టీ, ఎస్‌బీఐఎల్, కోల్‌కతా- 3, బ్యాకింగ్ సూపర్‌వైజరీ స్పెషలిస్ట్- 1, మేనేజర్ ఎనీటైమ్ ఛానల్- 1, వైస్ ప్రెసిడెంట్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 1, చీఫ్ మేనేజర్ (స్పెషల్ సిచ్యూవేషన్ టీమ్)- 3, డిప్యూటీ మేనేజర్ (స్ట్రెస్డ్ అసెట్స్ మార్కెటింగ్)- 3, డేటా ప్రొటెక్షన్ ఆఫీసర్- 1, డిప్యూటీ మేనేజర్ (ఐఎస్ ఆడిట్)- 8 మ‌రియు 
చీఫ్ ఆఫీసర్ (సెక్యూరిటీ)- 1 పోస్టులు ఉన్నాయి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.  దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది. ఇక  ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసుకోవ‌చ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: